త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjeev Arora | పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్‌

Sanjeev Arora | పంజాబ్ (Punjab) రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి (Punjab ministe) సంజీవ్ అరోరా (Sanjeev Arora) అరెస్ట‌య్యారు.

D

National | Published On May 9, 2026, 5.34 pm IST

Sanjeev Arora | పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్‌
Advertisement

Sanjeev Arora | పంజాబ్ (Punjab) రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి (Punjab ministe) సంజీవ్ అరోరా (Sanjeev Arora) అరెస్ట‌య్యారు. మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ (ED) అధికారులు అరోరాను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 వాహ‌నాల్లో ఇవాళ ఉద‌యం 7 గంట‌ల‌కు ఛండీగ‌ఢ్ సెక్టార్ 2లోని అరోరా అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఛండీగఢ్‌తో పాటు ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో, గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్‌లో ఉన్న 'హాంప్టన్ స్కై రియల్టీ లిమిటెడ్' కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయి.

మ‌నీలాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు సంజీవ్ అరోరా కంపెనీపై ఫిర్యాదులు ఉన్నాయి. దుబాయ్ నుంచి భార‌త్‌కు అక్ర‌మ నిధుల‌ను రౌండ్ ట్రిప్పింగ్ చేయ‌డం, మొబైల్ ఫోన్ల కొనుగోళ్ల పేరుతో రూ. 100 కోట్లకు పైగా ఫేక్ జీఎస్టీ బిల్లులు సృష్టించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన ఈడీ.. అరోరా నివాసం, కార్యాల‌యాల్లో సోదాలు చేప‌ట్టింది. ఈ సోదాల్లో కీల‌క ప‌త్రాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read..

ఉత్కంఠ‌కు తెర‌.. విజ‌య్‌కి వీసీకే మ‌ద్ద‌తు

రూ.10 వేల న‌గ‌దు, 3 రోజులు వేత‌నంతో కూడిన సెల‌వులు.. మ‌ద‌ర్స్‌డే సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌

కేసు న‌మోదు చేయ‌క‌పోతే.. మోదీ సమక్షంలో ఆత్మహత్య చేసుకుంటాం..!

Advertisement
Advertisement