త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jacqueline Fernandez | మనీ లాండరింగ్ కేసులో ట్విస్ట్ – బాలీవుడ్ హీరోయిన్‌కు ఎదురుదెబ్బ‌

200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో తాను అప్రూవ‌ర్‌గా మార‌తాన‌ని జాక్వెలిన్ ఇటీవ‌ల పిటిష‌న్ దాఖ‌లు చేసింది. జాక్వెలిన్ పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది. జాక్వెలిన్‌కు వ్య‌తిరేకంగా ఈడీ సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టింది.

N

Entertainment | Published On May 11, 2026, 8.10 pm IST

Jacqueline Fernandez | మనీ లాండరింగ్ కేసులో ట్విస్ట్ – బాలీవుడ్ హీరోయిన్‌కు ఎదురుదెబ్బ‌
Advertisement

Jacqueline Fernandez |  మ‌నీ లాండ‌రింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. రాన్‌బాక్సీ మాజీ ప్ర‌మోట‌ర్లు మ‌ల్వింద‌ర్ సింగ్‌, శివింద‌ర్ సింగ్‌ల‌కు బెయిల్ ఇప్పిస్తాన‌ని న‌మ్మించి 200 కోట్ల‌కుపైగా మోసాల‌కు పాల్ప‌డ్డాడంటూ సుఖేష్‌ చంద్ర‌శేఖ‌ర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మ‌నీ లాండ‌రింగ్‌ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు సంబంధం ఉందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో తాను అప్రూవ‌ర్‌గా మారుతాన‌ని ఇటీవ‌లే కోర్టులో జాక్వెలిన్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. తాను సుఖేష్ బాధితురాలినేని, అత‌డి క్రిమిన‌ల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలియ‌క సంబంధాలు కొన‌సాగించిన‌ట్లు ఈ పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది.

సంచ‌ల‌న విష‌యాలు...

సోమ‌వారం జాక్వెలిన్ పిటిష‌న్‌పై ఢిల్లీ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ విచార‌ణ‌లో బాలీవుడ్ హీరోయిన్‌కు వ్య‌తిరేకంగా ఈడీ ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ క్రిమిన‌ల్ బ్యాక్‌గ్రౌండ్, అత‌డి నిజ‌స్వ‌రూపం పూర్తిగా తెలిసే అత‌డితో జాక్వెలిన్ సంబంధాలు కొన‌సాగించింద‌ని ఈడీ వెల్ల‌డించింది.

కాస్ట్ లీ గిఫ్ట్‌లు...

మ‌నీ లాండ‌రింగ్ ద్వారా సంపాదించిన అక్ర‌మ మ‌నీతోనే సుఖేష్ కాస్ట్‌లీ గిఫ్ట్‌ల‌ను జాక్వెలిన్‌కు ఇచ్చాడ‌ని ఈడీ పేర్కొన్న‌ది. ఈ దోపీడి సొమ్ముతో తాను జ‌ల్సాలు చేయ‌డ‌మే కాకుండా త‌న కుటుంబ‌స‌భ్యులు కూడా ల‌బ్ది పొందేలా జాక్వెలిన్ చేసింద‌ని ఈడీ ఆరోప‌ణ‌లు చేసింది. జాక్వెలిన్ అమాయ‌కురాలు కాద‌ని, ఆమె మాట‌ల‌కు, చేసిన ప‌నుల‌కు పొంత‌న లేద‌ని, మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి అన్ని నిజాలు తెలిసినా... ఏ రోజు వాటిని బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని ఈడీ అన్న‌ది. ఆమె అప్రూవ‌ర్‌గా మారితే కేసు త‌ప్పుదోవ ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ఈడీ చెప్పింది.

మోసం చేశాడు..

ఈడీ ఆరోప‌ణ‌ల‌పై కోర్టులో జాక్వెలిన్ కూడా స్పందించింది.వ్యాపార‌వేత్త‌గా న‌మ్మించి సుఖేష్ త‌న‌ను మోసం చేశాడ‌ని, త‌న సినీ కెరీర్‌ను నాశ‌నం చేశాడ‌ని, త‌న జీవితాన్ని న‌ర‌క‌ప్రాయం చేశాడ‌ని కోర్టులో వెల్ల‌డించింది. ఈడీ వాద‌న‌ల‌పై మంగ‌ళ‌వారం (మే 12న) లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇవ్వాల‌ని జాక్వెలిన్‌ను కోర్టు ఆదేశించింది.

 

Advertisement
Advertisement