Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా
Congress | పంజాబ్ కాంగ్రెస్ (Punjab Congress)లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వరింగ్ (Amarinder Singh Raja Warring) రాజీనామా చేశారు.
Congress | త్రినేత్ర న్యూస్ : పంజాబ్ కాంగ్రెస్ (Punjab Congress)లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వరింగ్ (Amarinder Singh Raja Warring) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు (K C Venugopal) పంపించారు. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆయన రాజీనామాతో హైకమాండ్ మరో అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త అధ్యక్షుడి పేరును 24 నుంచి 48 గంటల్లో ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పీపీసీసీ (PPCC) చీఫ్ రేసులో మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా, జలంధర్ కాంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్, గురుదాస్‌పూర్ ఎంపీ సుఖ్‌జిందర్ సింగ్ రంధావా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేరు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, విజయ్ ఇందర్ సింగ్లా పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
పంజాబ్ కాంగ్రెస్‌లో చాలాకాలంగా వర్గ పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా వరింగ్ వర్గానికి, చరణ్‌జిత్ సింగ్ చన్నీ వర్గానికి మధ్య విభేదాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లోనూ వర్గ పోరు చాలాసార్లు బయటపడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ గతంలో వరింగ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తూ.. చన్నీకి పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించింది. అయినప్పటికీ సమస్య సమసిపోలేదు. ఈ అంతర్గత విభేదాలే రాజా వరింగ్ రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Also Read..
ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు
ఫారమ్-6లో మార్పులు చేయమని టీసీఎస్‌ను ఎవరు ఆదేశించారు..? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన రాహుల్
సీపీఏ స్టడీ టూర్.. బెర్లిన్‌లో మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌కు ఘన స్వాగతం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Singireddy Niranjan Reddy | సిరిసిల్లలో రేవంత్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద : హంతకుడే సంతాపం తెలిపినట్లుంది
సెప్టెంబర్ 30, 2026

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
సెప్టెంబర్ 30, 2026

CM Revanth Reddy | అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నాం
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..
- ●Amitabh Bachchan | షూటింగ్లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం
- ●Elon Musk | ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు
- ●Kajal Aggarwal | 30 కోట్లతో తీస్తే కోటి కలెక్షన్లు వచ్చాయి - ఓటీటీలో తెలుగులో రిలీజైన కాజల్ బాలీవుడ్ మూవీ
- ●CPA Study Tour | సీపీఏ స్టడీ టూర్.. బెర్లిన్‌లో మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌కు ఘన స్వాగతం

Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..

Amitabh Bachchan | షూటింగ్లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం

Elon Musk | ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు



