త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CPA Study Tour | సీపీఏ స్ట‌డీ టూర్‌.. బెర్లిన్‌లో మండ‌లి చైర్మ‌న్‌, శాస‌నస‌భ స్పీక‌ర్‌కు ఘ‌న స్వాగతం

CPA Study Tour | కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఆధ్వర్యంలో స్టడీ టూర్‌లో (CPA Study Tour) భాగంగా జర్మనీకి చేరుకున్న తెలంగాణ లేజిస్లేచర్ ప్రతినిధులకు బెర్లిన్ (Berlin) విమానాశ్రయంలో తెలంగాణ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

G

Telangana | Published On Oct 1, 2026, 11.07 am IST

CPA Study Tour | సీపీఏ స్ట‌డీ టూర్‌.. బెర్లిన్‌లో మండ‌లి చైర్మ‌న్‌, శాస‌నస‌భ స్పీక‌ర్‌కు ఘ‌న స్వాగతం
Advertisement

CPA Study Tour | త్రినేత్ర న్యూస్‌: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఆధ్వర్యంలో స్టడీ టూర్‌లో (CPA Study Tour) భాగంగా జర్మనీకి చేరుకున్న తెలంగాణ లేజిస్లేచర్ ప్రతినిధులకు బెర్లిన్ (Berlin) విమానాశ్రయంలో తెలంగాణ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy), శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar), మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కుమార్‌కు తెలంగాణ విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు.

కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఆధ్వర్యంలో తెలంగాణ లేజిస్లేచర్ తరఫున చేపట్టిన స్టడీ టూర్‌లో భాగంగా ప్రతినిధి బృందం బెర్లిన్ నగరానికి చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా పార్లమెంటరీ వ్యవస్థలు, శాసనసభల పనితీరు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. అలాగే అక్కడి పార్లమెంటరీ వ్యవస్థలు, ప్రజాప్రతినిధుల విధులు, శాసన ప్రక్రియలకు సంబంధించిన అంశాలను పరిశీలించి పరస్పర అనుభవాలను పంచుకోనున్నారు.

Advertisement
Advertisement