త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్‌ల‌ను ఇలా సింపుల్‌గా ట్రాన్స్‌ఫ‌ర్ చేయండి..

WhatsApp | కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారినప్పుడు చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య వాట్సాప్ చాట్ హిస్టరీ కోల్పోవడమే. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వ్యక్తిగత, కార్యాలయ సంభాషణలు, ఫొటోలు, వీడియోల‌ను కొత్త ఫోన్‌లోకి ఎలా తీసుకెళ్లాలనే ఆందోళన ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ సమస్యకు వాట్సాప్ శాశ్వత పరిష్కారం తీసుకొచ్చింది.

S

Technology | Published On Jul 28, 2026, 1.40 pm IST

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్‌ల‌ను ఇలా సింపుల్‌గా ట్రాన్స్‌ఫ‌ర్ చేయండి..
Advertisement

WhatsApp | కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారినప్పుడు చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య వాట్సాప్ చాట్ హిస్టరీ కోల్పోవడమే. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వ్యక్తిగత, కార్యాలయ సంభాషణలు, ఫొటోలు, వీడియోల‌ను కొత్త ఫోన్‌లోకి ఎలా తీసుకెళ్లాలనే ఆందోళన ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ సమస్యకు వాట్సాప్ శాశ్వత పరిష్కారం తీసుకొచ్చింది. మెటా సంస్థ త‌న వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఏడాది ప్రారంభంలోనే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు, అలాగే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు నేరుగా చాట్‌లను బదిలీ చేసే ఇంట‌ర్న‌ల్‌ క్రాస్ ప్లాట్‌ఫామ్ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా సందేశాలు, ఫొటోలు, వీడియోలు సహా మొత్తం చాట్ హిస్టరీని ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు సురక్షితంగా బ‌దిలీ చేసుకోవచ్చు. రెండు ఫోన్‌లు అవసరమైన సిస్టమ్ అర్హతల‌ను కలిగి ఉంటే ఈ ప్రక్రియ చాలా సులభంగా పూర్తవుతుంది.

ఎలా ప‌నిచేస్తుంది..

వాట్సాప్ అందిస్తున్న ఈ ఫీచర్ క్లౌడ్ బ్యాకప్‌లపై ఆధారపడదు. ఆండ్రాయిడ్‌లో గూగుల్ డ్రైవ్, ఐఫోన్‌లో ఐక్లౌడ్ వంటి వేర్వేరు బ్యాకప్ వ్యవస్థల బదులుగా, స్థానిక వైఫై కనెక్షన్ ద్వారా రెండు ఫోన్‌ల మధ్య నేరుగా డేటాను బదిలీ చేస్తుంది. దీంతో చాట్‌లు క్లౌడ్ సర్వర్ల ద్వారా వెళ్లవు. బదిలీ సమయంలో వ్యక్తిగత సమాచారాన్ని తాము చూడలేమని వాట్సాప్ స్పష్టం చేసింది. అయితే ఈ ఫీచర్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. పాత చాట్‌లను ఇప్పటికే కొత్త ఫోన్‌లో ఉన్న చాట్‌లతో విలీనం చేసే అవకాశం లేదు. అలాగే పాత ఫోన్‌లో నంబర్ మార్చకుండా నేరుగా వేరే మొబైల్ నంబర్‌కు చాట్‌లను బదిలీ చేయడం సాధ్యం కాదు. వాట్సాప్ బిజినెస్ చాట్‌లు, స్టేటస్ అప్‌డేట్‌లు, పీర్-టు-పీర్ పేమెంట్ సందేశాలు ఈ ట్రాన్స్‌ఫర్‌లో భాగం కావు.

ఎలా ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలి..

చాట్‌లను బదిలీ చేయడానికి ముందు రెండు ఫోన్‌లలోనూ తాజా వెర్షన్ వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. రెండు ఫోన్‌లలో ఒకే మొబైల్ నంబర్‌తో వాట్సాప్ ఉపయోగించాలి. స్థిరమైన వై-ఫై కనెక్షన్ ఉండాలి. రెండు ఫోన్‌లలో తగినంత బ్యాటరీ ఉండడంతో పాటు, ఐఫోన్‌లో చాట్‌లు, మీడియా నిల్వ చేసేందుకు సరిపడా ఖాళీ స్టోరేజ్ కూడా ఉండాలి. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్‌లను బదిలీ చేయాలంటే ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ను ఓపెన్ చేసి చాట్స్ > ట్రాన్స్‌ఫర్ చాట్ హిస్టరీ > ట్రాన్స్‌ఫర్ టు ఐఫోన్ ఆప్ష‌న్ ను ఎంచుకోవాలి. చాట్ హిస్టరీ సిద్ధమైన తర్వాత కనిపించే కంటిన్యూ బటన్‌ను ట్యాప్ చేయాలి. అవసరమైతే ఆండ్రాయిడ్ ఫోన్ కెమెరా ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వాలి. ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యే వరకు ఫోన్‌ను అన్‌లాక్‌లోనే ఉంచాలి.

ఐఫోన్‌లో..

తర్వాత ఐఫోన్‌లో వాట్సాప్ ను ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉపయోగిస్తున్న అదే మొబైల్ నంబర్‌తో ఖాతాను ధ్రువీకరించాలి. రెండు ఫోన్‌లు కనెక్ట్ కావడానికి అనుమతి కోరితే అలౌ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ఐఫోన్‌లో కనిపించే క్యూ ఆర్ కోడ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ కెమెరాతో స్కాన్ చేయాలి. అనంతరం ఆండ్రాయిడ్ ఫోన్‌లో కనిపించే జాయిన్ ఆప్షన్‌ను ట్యాప్ చేసి తాత్కాలిక వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావాలి. కొన్ని నిమిషాలు వేచి ఉంటే వాట్సాప్ మీ చాట్ హిస్టరీతో పాటు ఫొటోలు, వీడియోలను కూడా ఐఫోన్‌కు బదిలీ చేస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఐఫోన్‌లో నెక్స్ట్ ఆప్ష‌న్‌ను ఉంచుకోవాలి. అనంతరం మీ పాత చాట్‌లన్నీ కొత్త ఐఫోన్‌లో కనిపిస్తాయి. ఇక నుంచి కొత్త ఫోన్‌లోనే వాట్సాప్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు.

Advertisement
Advertisement