త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prince William | స‌చిన్‌తో గ‌ల్లీ క్రికెట్ ఆడిన బ్రిట‌న్ యువ‌రాజు విలియ‌మ్స్‌.. ముంబై వీధుల్లో రోమింగ్‌

Prince William | బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం (Prince William), యువరాణి కేట్ మిడిల్టన్ (Kate Middleton) ముంబై వీధుల్లో సంద‌డి చేశారు. బాల్లార్డ్ ఎస్టేట్‌లో క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో (Sachin Tendulkar) కలిసి గల్లీ క్రికెట్ (Gully Cricket) ఆడారు.

D

National | Published On Nov 16, 2026, 12.35 pm IST

Prince William | స‌చిన్‌తో గ‌ల్లీ క్రికెట్ ఆడిన బ్రిట‌న్ యువ‌రాజు విలియ‌మ్స్‌.. ముంబై వీధుల్లో రోమింగ్‌
Advertisement

Prince William | త్రినేత్ర న్యూస్ : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం (Prince William), యువరాణి కేట్ మిడిల్టన్ (Kate Middleton) భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ముంబైలోని బాల్లార్డ్ ఎస్టేట్‌లో క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో (Sachin Tendulkar) కలిసి గల్లీ క్రికెట్ (Gully Cricket) ఆడారు. స‌చిన్ బ్యాటింగ్ చేస్తుండ‌గా.. ప్రిన్స్ విలియం బౌలింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే 'ఎర్త్‌షాట్ ప్రైజ్' (Earthshot Prize) అవార్డుల వేడుక కోసం ముంబై (Mumbai) న‌గ‌రానికి వచ్చిన రాజదంపతులు తొలిరోజు దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ (Ballard Estate) వీధుల్లో సందడి చేశారు. స‌చిన్‌తో క‌లిసి ముంబై వీధుల్లో తిరుగుతూ.. స్థానిక ఫుడ్‌ను ఎంజాయ్ చేశారు. రోడ్డు పక్కన నిలబడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్ వద్ద కుల్హడ్ (మట్టి కప్పు)లో వేడివేడి ఛాయ్‌ని ఆస్వాదించారు. స్థానిక స్ట్రీట్ ఫుడ్ రుచి చూశారు.

Also Read..

క‌డుపుతో ఉన్న‌ప్పుడు రోజుకు 100 సిగ‌రెట్లు కాల్చా : ప్ర‌ముఖ న‌టి

వ‌రుస‌గా రెండోసారి.. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏక‌గ్రీవ ఎన్నిక‌

భార‌త్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ దేశాల‌తో సంబంధాలే అత్యంత కీల‌కం : ప్ర‌ధాని మోదీ

Advertisement
Advertisement