PM Modi | భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ దేశాలతో సంబంధాలే అత్యంత కీలకం : ప్రధాని మోదీ
PM Modi | ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలు మనదేశ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'కి (Act East Policy) అత్యంత కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. భారత్ ప్రతిపాదించిన 'మహాసాగర్' దార్శనికతలోనూ ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : ఆగ్నేయాసియా దేశాలతో (Asean) వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా భారత్ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మూడు రోజుల ఫిలిప్పీన్స్ (Philippines) పర్యటనకు బయల్దేరి వెళ్లారు. మనీలా (Manila)లో నవంబర్ 16–17 తేదీల్లో జరిగే 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు (23rd Asean-India Summit), 21వ తూర్పు ఆసియా సదస్సుల్లో (21st East Asia Summit) పాల్గొంటారు. ఈ పర్యటకు బయల్దేరి వెళ్లే ముందు ప్రధాని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలు మనదేశ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'కి (Act East Policy) అత్యంత కీలకమని తెలిపారు. భారత్ ప్రతిపాదించిన 'మహాసాగర్' దార్శనికతలోనూ ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధంతో మొదలైన ఈ సంబంధాలు నేడు వాణిజ్యం, రవాణా అనుసంధానత, సముద్ర భద్రత (Maritime Security), సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాల వరకు విస్తరించాయని తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వంపై చర్చించడానికి తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన వేదిక అని ప్రధాని నొక్కిచెప్పారు. 23వ ఆసియాన్-భారత్ సదస్సులో భాగంగా ఇతర దేశాల నేతలతో కలిసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తానని మోదీ తెలిపారు. ఉమ్మడి అభివృద్ధి, ఆర్థిక పురోగతి, ప్రాంతీయ అనుసంధానం, ప్రజల సంక్షేమం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
మోదీ-ట్రంప్ భేటీ
ఈ పర్యటనలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతల 'క్వాడ్' సమావేశం అత్యంత కీలకం కానుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా జరుగుతున్న ఆసియాన్ (ASEAN) సదస్సు సందర్భంగా నవంబర్ 17 సాయంత్రం క్వాడ్ (Quad) దేశాల అధినేతల సమావేశం జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనే తకైచి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న సైనిక ప్రభావాన్ని ఎదుర్కోవడం, ఆర్థిక భద్రత, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పనపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. కీలక ఖనిజాల సరఫరా గొలుసులు (critical mineral supply chains), ఇంధన భద్రత, విశ్వసనీయ కృత్రిమ మేధ (AI) మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు కూడా ఈ భేటీలో కీలకంగా ఉండనున్నాయి
దాదాపు రెండేళ్ల తర్వాత క్వాడ్ దేశాధినేతలు సమావేశం కానుండటం ప్రాధానత్య సంతరించుకుంది. చివరిసారిగా క్వాడ్ అధినేతల సమావేశం 2024 సెప్టెంబర్ 21న డెలావేర్ వేదికగా అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన జరిగింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక, సనే తకైచి జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి క్వాడ్ అధినేతల సదస్సు ఇదే. అంతేకాదు, సాధారణంగా క్వాడ్ సభ్యదేశాల్లోనే ఈ సదస్సు జరుగుతుండగా మొట్టమొదటిసారి నాన్-క్వాడ్ దేశమైన ఫిలిప్పీన్స్‌లో ఈ సమావేశం జరగనుండడం విశేషం.
Also Read..
వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం..
స్నేహితుడితో కలసి బయటకు వెళ్లింది.. అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minister Uttam Kumar Reddy | పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇప్పించండి
నవంబర్ 15, 2026

CM Revanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
నవంబర్ 15, 2026

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●High Court | పాడి కౌశిక్‌రెడ్డికి షాక్.. పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
- ●Amitabh Bachchan | బతికిపోయా.. వరుస బెదిరింపుల వేళ అర్ధరాత్రి అమితాబ్ ఆసక్తికర పోస్ట్
- ●BMW Recall | 7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్.. అగ్నిప్రమాద ముప్పుపై హెచ్చరిక..
- ●Ponnam Prabhakar | దివ్యాంగులు, వృద్ధులకు సేవ చేయడం అదృష్టం: పొన్నం ప్రభాకర్
- ●NIFTEE 2027 | ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగించిన NTA, పూర్తి షెడ్యూల్ ఇదే!
- ●Pending Traffic Challans | పెండింగ్ చాలాన్ క్లియరెన్స్.. రూ.500 ఫైన్‌కు రూ.100 కడితే చాలు..

High Court | పాడి కౌశిక్‌రెడ్డికి షాక్.. పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

Amitabh Bachchan | బతికిపోయా.. వరుస బెదిరింపుల వేళ అర్ధరాత్రి అమితాబ్ ఆసక్తికర పోస్ట్

BMW Recall | 7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్.. అగ్నిప్రమాద ముప్పుపై హెచ్చరిక..

Ponnam Prabhakar | దివ్యాంగులు, వృద్ధులకు సేవ చేయడం అదృష్టం: పొన్నం ప్రభాకర్



