Teja Sajja | గ్రాండ్‌గా హీరో తేజా సజ్జా ఎంగేజ్‌మెంట్ – పెళ్లి ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా ఓ ఇంటివాడుకాబోతున్నారు. అతడి ఎంగేజ్‌మెంట్ సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుతో పాటు హీరోలు రవితేజ, నాని డైరెక్టర్లు ప్రశాంత్ వర్మ, రాఘవేంద్రరావుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Entertainment | Published On Nov 16, 2026, 1.35 pm IST
Teja Sajja | టాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంది. టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతోన్నారు. ఇటీవలే మెగా హీరో సాయిధరమ్‌తేజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తాజాగా మరో యంగ్ హీరో తేజా సజ్జా కూడా ఓ ఇంటివాడు కాబోతున్నారు. అతడి ఎంగేజ్‌మెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు రవితేజ, నాని, శ్రీకాంత్, ప్రశాంత్ వర్మ, కార్తీక్ ఘట్టమనేని, రాఘవేంద్రరావు, వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు.
పెద్దలు కుదిర్చిన వివాహం...
తేజ సజ్జాది పెద్దలు కుదిర్చిన వివాహమని సమాచారం. కాబోయే భార్య కుటుంబానికి సినీ రంగంతో పరిచయం లేదని అంటున్నారు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తేజా సజ్జా పెళ్లి జరుగనుంది.
చూడాలని ఉంది...
చైల్డ్ యాక్టర్‌గా చిరంజీవి చూడాలని ఉంది సినిమాతో తేజా సజ్జా నట ప్రయాణం ప్రారంభమైంది. ఇంద్ర, యువరాజు, బాచి, వసంతం, గంగోత్రితో పాటు పలు సినిమాల్లో బాలనటుడిగా కనిపించాడు. జాంబీరెడ్డి సినిమాతో హీరోగా మారాడు. హనుమాన్, మిరాయ్ సినిమాలతో కథానాయకుడిగా పెద్ద విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం జాంబీరెడ్డి 2 సినిమా చేస్తోన్నాడు.
Mass Maharaja @RaviTeja_offl makes an energetic entry at the #TejaSajjaEngagement. ❤️
Super Hero @tejasajja123 https://t.co/qQSoJW6T6g
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 16, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramchandar Rao | భారత్‌ను అవమానిస్తుంటే రేవంత్, రాహుల్ చప్పట్లు కొడతరా?
నవంబర్ 16, 2026

Osmania Students Protest | E1, E2 హాస్టళ్లకు నీళ్లు, కరెంటు ఇచ్చేదాకా కదలం: ఉస్మానియా స్టూడెంట్స్
నవంబర్ 16, 2026

Megha Shetty | ఆది సాయికుమార్ “అరుంధతి నక్షత్రం” – టాలీవుడ్లోకి మరో కన్నడ బ్యూటీ
నవంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Vidya Balan | బాలకృష్ణ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరోయిన్
- ●Airtel Insider | ఎయిర్టెల్ కస్టమర్లకు రూ.30 వేలకుపైగా ప్రయోజనాలు.. కొత్త రివార్డ్స్ ప్రోగ్రామ్..
- ●Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు
- ●Ramchandar Rao | భారత్‌ను అవమానిస్తుంటే రేవంత్, రాహుల్ చప్పట్లు కొడతరా?
- ●Varanasi Movie | "వారణాసి"కి గుమ్మడికాయ కొట్టేసిన రాజమౌళి - అప్డేట్తో పోస్ట్‌పోన్ రూమర్లకు పుల్‌స్టాప్
- ●Ashutosh Dixit | భారత రక్షణ వ్యవస్థపై గూఢచర్య ముప్పు.. వైమానిక దళ అధిపతి కీలక హెచ్చరికలు

Vidya Balan | బాలకృష్ణ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరోయిన్

Airtel Insider | ఎయిర్టెల్ కస్టమర్లకు రూ.30 వేలకుపైగా ప్రయోజనాలు.. కొత్త రివార్డ్స్ ప్రోగ్రామ్..

Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు

Ramchandar Rao | భారత్‌ను అవమానిస్తుంటే రేవంత్, రాహుల్ చప్పట్లు కొడతరా?



