త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jay Shah | వ‌రుస‌గా రెండోసారి.. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏక‌గ్రీవ ఎన్నిక‌

Jay Shah | అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) చైర్మ‌న్‌గా జైషా (Jay Shah) మ‌రోసారి ఎన్నిక‌య్యారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ సమావేశంలో జై షాను రెండోసారి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

D

Sports | Published On Nov 16, 2026, 11.37 am IST

Jay Shah | వ‌రుస‌గా రెండోసారి.. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏక‌గ్రీవ ఎన్నిక‌
Advertisement

Jay Shah | త్రినేత్ర న్యూస్ : అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (International Cricket Council) చైర్మ‌న్‌గా జైషా (Jay Shah) మ‌రోసారి ఎన్నిక‌య్యారు. ఇండోనేషియాలోని బాలి (Bali)లో జరిగిన ఐసీసీ సమావేశంలో (ICC Directors) జై షాను రెండోసారి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ స‌మావేశంలో జై షా పేరును ఐసీసీ డైరెక్టర్లు ప్రతిపాదించగా.. ఆయన నాయకత్వంపై బోర్డు మరోసారి విశ్వాసం ప్రకటించిన‌ట్లు ఐసీసీ ప్ర‌క‌టించింది. దీంతో వ‌రుస‌గా రెండోసారి ఆ ప‌ద‌వి చేప‌ట్టిన భార‌తీయుడిగా జైషా రికార్డు సృష్టించారు.

జై షా 2024 డిసెంబర్ 1న గ్రెగ్ బార్క్లే స్థానంలో మొదటిసారి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన విష‌యం తెలిసిందే. త‌ద్వారా 35 ఏళ్ల వయసులో ఈ పదవిని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు. అంతేకాదు, భారత్‌ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఐదో వ్యక్తిగానూ షా నిలిచారు. గతంలో జగ్‌మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్‌, ఎన్‌.శ్రీనివాసన్‌, శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ చైర్మన్లుగా పనిచేశారు.

తన పునర్నియామకంపై జై షా సంతోషం వ్య‌క్తం చేశారు. ఐసీసీ బోర్డు తనపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన డైరెక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. "ఐసీసీ చైర్మన్‌గా సేవ చేయడం గౌర‌వంగా భావిస్తున్నా. ఇది చాలా పెద్ద బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు సభ్యులందరితో కలిసి పనిచేసేందుకు నేను కట్టుబడి ఉన్నాను" అని షా పేర్కొన్నారు. క్రికెట్ ఒలింపిక్స్‌లోకి తిరిగి రావడం ద్వారా కొత్త ప్రేక్షకులకు ఈ ఆటను పరిచయం చేసే గొప్ప అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అభిమానులు, ఆటగాళ్లు, వాణిజ్య భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.

Also Read..

భార‌త్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ దేశాల‌తో సంబంధాలే అత్యంత కీల‌కం : ప్ర‌ధాని మోదీ

ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి.. కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డిని కోరిన చిరంజీవి

వాణిజ్య భ‌వ‌నంలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Advertisement
Advertisement