Megha Shetty | ఆది సాయికుమార్ “అరుంధతి నక్షత్రం” – టాలీవుడ్‌లోకి మరో కన్నడ బ్యూటీ
టాలీవుడ్‌లో కన్నడ బ్యూటీలదే హవా కొనసాగుతోంది. తాజాగా మరో కన్నడ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ఆది సాయికుమార్ హీరోగా "అరుంధతి నక్షత్రం" ఎమోషనల్ కామెడీ డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా కన్నడ హీరోయిన్ మేఘా శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.
Entertainment | Published On Nov 16, 2026, 2.16 pm IST
Megha Shetty | శంబాల సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్టు అందుకున్నాడు ఆది సాయికుమార్. ఈ సక్సెస్ తర్వాత కథల ఎంపికలో వైవిధ్యంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఆది సాయికుమార్ ఓ కొత్త మూవీ అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. "అరుంధతి నక్షత్రం" పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
కామెడీ డ్రామా
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కన్నడ హీరోయిన్ మేఘాశెట్టి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఆమెతో పాటు మధు దామరాజు మరో నాయికగా కనిపించబోతుంది. ఆది హీరోగా నటిస్తోన్న 28వ సినిమా ఇది.
సెకండ్ మూవీ ఇది
"అరుంధతి నక్షత్రం" సినిమాను సందీప్ అగరం, ఆష్మితరెడ్డి, సూర్యకాంతి కూచిభోట్ల నిర్మిస్తున్నారు. నవంబర్ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తర్వాత రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సెకండ్ మూవీ ఇది. ఓ పల్లెటూరి కుర్రాడి కథ ఇది, అతని జీవితాన్ని మలుపులు తిప్పిన సంఘటనలు, ఆ మలుపులతో ముడిపడిన కొంతమంది మనుషులతో ఆద్యంతం ఆహ్లాదంగా సాగుతుందని దర్శకుడు అన్నాడు. "అరుంధతి నక్షత్రం" సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు.
కన్నడంలో...
కన్నడంలో ట్రిపుల్ రైడింగ్, దిల్‌పసంద్, కైవ, గ్రామాయణ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. సినిమాల్లోకి రాకముందు కొన్ని సీరియల్స్ చేసింది. ఇటీవలే పుష్పక విమానం వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది మధు దామరాజు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!
- ●Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?
- ●Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!
- ●Deeksha Diwas | దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు 'దీక్షా దివస్' ప్రత్యేక కార్యక్రమాలు
- ●Cyclone Akvan | ఏపీపై 'అక్వాన్' తుఫాన్ పంజా.. అమరావతికి మళ్లీ ముంపు ముప్పు!
- ●Rashmika Mandanna | ఏనాటి వరమో నువ్వు - తండ్రి ప్రేమను గుర్తుచేసుకున్న రష్మిక

Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!

Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?

Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!

Deeksha Diwas | దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు 'దీక్షా దివస్' ప్రత్యేక కార్యక్రమాలు






