త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ క‌ల‌ర్‌లోనే ఎందుకుంట‌య్‌..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!

Indian Railways | రైలులో ప్రయాణించేటప్పుడు కోచ్‌లలోని సీట్లు, బెర్తులను ఎప్పుడైనా గమనించారా? ముఖ్యంగా రైళ్లలో ఎక్కువగా నీలం రంగు సీట్లే కనిపిస్తుంటాయి. రైల్వే శాఖ ఈ రంగునే ఎందుకు ఎంచుకుంది? దీని వెనుక ప్రయాణికుల సౌకర్యం మొదలుకొని నిర్వహణ వరకు పలు కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..!

P

National | Published On Nov 21, 2026, 3.30 pm IST

Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ క‌ల‌ర్‌లోనే ఎందుకుంట‌య్‌..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!
Advertisement

Indian Railways | రైలులో ప్రయాణించేటప్పుడు కోచ్‌లలోని సీట్లు, బెర్తులను ఎప్పుడైనా గమనించారా? ముఖ్యంగా రైళ్లలో ఎక్కువగా నీలం రంగు సీట్లే కనిపిస్తుంటాయి. రైల్వే శాఖ ఈ రంగునే ఎందుకు ఎంచుకుంది? దీని వెనుక ప్రయాణికుల సౌకర్యం మొదలుకొని నిర్వహణ వరకు పలు కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..!

భారతదేశంలో ప్రయాణికుల రవాణాలో రైల్వే వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. కొందరు గంటల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరుకుంటే.. మరికొందరు 15 నుంచి 30 గంటలకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయాణాల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం ఎంతో ముఖ్యం. రైలు కోచ్‌లలో సీట్ల ఏర్పాటు, వాటి తయారీ, రంగుల ఎంపిక వంటి అంశాలు కూడా ప్రయాణ అనుభూతిపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే సంప్రదాయ ఐసీఎఫ్ (ICF) కోచ్‌లలో నీలం రంగు సీట్లు, బెర్తులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

బ్లూ క‌ల‌ర్ ఎందుకు అంటే..?

సాధారణంగా రంగులు మనిషి భావోద్వేగాలు, మానసిక స్థితిపై కొంత ప్రభావం చూపుతాయని రంగుల మనస్తత్వ శాస్త్రం (Colour Psychology) చెబుతుంది. నీలం రంగు ప్రశాంతత, స్థిరత్వం, నమ్మకానికి ప్రతీకగా భావిస్తారు. ఆకాశం, సముద్రం వంటి ప్రకృతి దృశ్యాలతోనూ ఈ రంగుకు అనుబంధం ఉంది. రైలు ప్రయాణాలు చాలాసార్లు సుదీర్ఘంగా సాగుతుంటాయి. ప్రయాణికులు గంటల తరబడి ఒకే కోచ్‌లో కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కళ్లకు ఇబ్బంది కలిగించని, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం అవసరం. నీలం రంగు సీట్లు కోచ్‌లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడంలో సహాయపడతాయని భావిస్తారు. అందుకే సంప్రదాయ రైల్వే కోచ్‌లలో ఈ రంగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

మరకలు, దుమ్ము కనిపించకుండా..

రైల్వే కోచ్‌లలో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణ సమయంలో సీట్లపై కూర్చోవడం, బ్యాగులు పెట్టడం, ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో దుమ్ము, చిన్నపాటి మరకలు ఏర్పడుతుంటాయి. లేత రంగులతో పోలిస్తే ముదురు నీలం రంగు వస్త్రాలపై కొన్ని చిన్నపాటి మరకలు, దుమ్ము అంత త్వరగా కనిపించవు. దీంతో సీట్లు తరచూ ఉపయోగించినప్పటికీ వాటి రూపం కొంతకాలం వరకు మెరుగ్గా కనిపించే అవకాశం ఉంటుంది. నీలం రంగులో మరకలు స్పష్టంగా కనిపించవని చెప్పి క్లిన్‌గా ఉండ‌వ‌ని కాదు. ప్రయాణికుల ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా కోచ్‌లను ఎప్ప‌టిక‌ప్పుడు రైల్వే శుభ్రం చేస్తూనే ఉంటుంది.

సుదీర్ఘ ప్రయాణాల్లోనూ కళ్లకు ఆహ్లాదం..

భారతీయ రైళ్లలో కొన్ని ప్రయాణాలు ఒకటి, రెండు రోజులకు పైగా కొనసాగుతుంటాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ సమయం కోచ్‌లలోనే గడపాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్‌లోని రంగులు, వెలుతురు, సీట్ల అమరిక ప్రయాణికుల అనుభూతిని ప్రభావితం చేస్తాయి. అధికంగా ఆకర్షించే రంగుల కంటే ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించే రంగులు సుదీర్ఘ ప్రయాణాల్లో అనుకూలంగా ఉంటాయని భావిస్తారు. నీలం రంగు కళ్లకు సౌమ్యంగా అనిపించడం, కోచ్‌లో ఒకే తరహా రంగు అమరిక ఉండటం వల్ల ప్రయాణ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. రద్దీగా ఉండే రైళ్లలోనూ ఇలాంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి.

మన్నిక, నిర్వహణ కూడా కీలకమే..

రైల్వే సీట్లు నిరంతరం వినియోగంలో ఉంటాయి. ప్రయాణికుల కదలికలు, కూర్చునే సమయంలో పడే ఒత్తిడి, దుమ్ము, ఇతర కారణాలతో సీట్ల వస్త్రాలు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల రైల్వే శాఖ సీట్ల తయారీలో మన్నికైన వస్త్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సీట్ల రంగును నిర్ణయించేటప్పుడు కేవలం అందానికే ప్రాధాన్యం ఇవ్వరు. వస్త్రం నాణ్యత, మన్నిక, నిర్వహణ సౌలభ్యం, ఖర్చు వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. అవసరాన్ని బట్టి సీట్ల వస్త్రాలను మార్చడం, దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేయడం వంటి నిర్వహణ చర్యలు చేపడతారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రంగులు, వస్త్రాల ఎంపిక జరుగుతుంది.

అన్ని రైళ్లలో నీలం రంగు సీట్లే ఉండవు..

భారతీయ రైల్వేలోని అన్ని రైళ్లలోనూ నీలం రంగు సీట్లే ఉంటాయని అనుకోవడం పొరపాటే. సంప్రదాయ ఐసీఎఫ్ (Integral Coach Factory) కోచ్‌లలో నీలం రంగు సీట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆధునిక ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లు, కొత్త తరం రైళ్లలో సీట్ల రంగులు, డిజైన్లు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా వందే భారత్ వంటి ఆధునిక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యం, కోచ్‌ల రూపకల్పనకు అనుగుణంగా విభిన్న రంగులు, డిజైన్లతో కూడిన సీట్లను ఉపయోగిస్తున్నారు. ఏసీ కోచ్‌లు, ఇతర ప్రయాణ తరగతుల్లోనూ సీట్ల రంగులు మారుతూ ఉంటాయి. రైలు రకం, ప్రయాణ తరగతి, కోచ్‌లో కల్పించిన సదుపాయాలను బట్టి సీట్ల రూపకల్పనలో మార్పులు క‌నిపిస్తున్నాయి.

Advertisement
Advertisement