త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు

Mahesh Kumar Goud | బీఆర్ఎస్ ప‌దేళ్ల అవినీతిని ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు అని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆధారాల‌తో స‌హా దొరికిపోయిన అవినీతిప‌రులు బీఆర్ఎస్ నేత‌లు అని ఆయ‌న మండిప‌డ్డారు.

S

Telangana | Published On Nov 21, 2026, 2.53 pm IST

Mahesh Kumar Goud | బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ ప‌దేళ్ల అవినీతిని ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు అని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆధారాల‌తో స‌హా దొరికిపోయిన అవినీతిప‌రులు బీఆర్ఎస్ నేత‌లు అని ఆయ‌న మండిప‌డ్డారు. నిజామాబాద్‌లో శ‌నివారం మ‌హేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ సీఎంగా, హరీష్ రావు మంత్రిగా ఉన్నపుడు నీటి దోపిడి జ‌రిగింది. కాళేశ్వరం పేరిట లక్షల కోట్ల రూపాయలు నీటి పాల‌య్యాయి. బీఆర్ఎస్ హ‌యాంలో విచ్చ‌ల‌విడిగా భూదోపిడీ జ‌రిగింది. బీఆర్ఎస్ అవినీతి చిట్టా పెద్దది. తెలంగాణ‌కు నీటి వాటా విష‌యంలో చుక్క నీటి బొట్టును వ‌దులుకోం. సీఎం రేవంత్ రెడ్డి చిత్త‌శుద్ధితో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నార‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement