Ramayana | రామాయణంలోని మరో కోణం – లక్ష్మణుడి కథతో సినిమా – షూటింగ్ మొత్తం ఏఐతోనే…
రామాయణం ఆధారంగా మరో సినిమా రాబోతుంది. శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ది లక్ష్మణ అన్‌టోల్డ్ స్టోరీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఏఐ టెక్నాలజీతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
Entertainment | Published On Nov 21, 2026, 3.15 pm IST
Ramayana | రామాయణ గాథ ఆధారంగా వివిధ భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇవన్నీ సీతారాముల పాత్రల ప్రధానంగానే సాగాయి. కానీ ఫస్ట్ టైమ్ శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడి కథతో ఓ సినిమా రాబోతుంది ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’. పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమాను రూపొందించబోతున్నారు.
అన్న మాట జవదాటని తమ్ముడు...
రామాయణంలో అన్న శ్రీరాముడి మాట జవదాటని తమ్ముడిగా పేరు తెచ్చుకున్న లక్ష్మణుడి జీవితం గురించి ఎవరికి తెలియని విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇండియాలోనే తొలి ఫోటోరియలిస్టిక్ ఏఐ సినిమాగా ది లక్ష్మణ రూపొందుతోంది. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర, ఆయన సాహసాలు, త్యాగాలు, వీరత్వాన్ని సరికొత్త కోణంలో ఇందులో ఆవిష్కరించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఐదు భాషల్లో...
ది లక్ష్మణ సినిమాకు పి రాధాకృష్ణ కథను అందిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. పవన్, నితిన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏఐ మూవీని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేసేందుక సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల ది లక్ష్మణ మూవీ పోస్టర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Idupu Kayitham | ఇడుపుకాయితం నుంచి పెళ్లి పాట రిలీజ్ – ఐదుగురు సింగర్లతో….
నవంబర్ 21, 2026

Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ – దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
నవంబర్ 21, 2026

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు – హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Life Insurance | రూ.1 కోటి బీమా తీసుకున్నాక వ్యక్తి మృతి.. చెల్లింపునకు సంస్థ నిరాకరణ.. తరువాత ఏమైంది..?
- ●Mahesh Kumar Goud | బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు
- ●Idupu Kayitham | ఇడుపుకాయితం నుంచి పెళ్లి పాట రిలీజ్ - ఐదుగురు సింగర్లతో....
- ●Home Loan | స్థలం తండ్రి పేరిట ఉంటే పిల్లలు ఇల్లు కట్టుకోవచ్చా..? ఇంటి రుణం లభిస్తుందా..?
- ●Tollywood | విడుదల రోజే పైరసీ బారిన పడిన దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా - కేసు నమోదు
- ●Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Life Insurance | రూ.1 కోటి బీమా తీసుకున్నాక వ్యక్తి మృతి.. చెల్లింపునకు సంస్థ నిరాకరణ.. తరువాత ఏమైంది..?

Mahesh Kumar Goud | బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు

Idupu Kayitham | ఇడుపుకాయితం నుంచి పెళ్లి పాట రిలీజ్ - ఐదుగురు సింగర్లతో....

Home Loan | స్థలం తండ్రి పేరిట ఉంటే పిల్లలు ఇల్లు కట్టుకోవచ్చా..? ఇంటి రుణం లభిస్తుందా..?



