త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్న‌రు

Harish Rao | రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నార‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మ‌ళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాద‌ని ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బ‌హిరంగంగా వ్యాఖ్యానిస్తున్నార‌ని తెలిపారు.

S

Telangana | Published On Nov 21, 2026, 3.17 pm IST

Harish Rao | రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్న‌రు
Advertisement

కాంగ్రెస్ అధికారంలోకి రాద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్న‌రు
రేపోమాపో ఖైర‌తాబాద్‌లో ఉప ఎన్నిక
ఈసారి రాష్ట్రంలో కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని ప‌లు స‌ర్వేల్లో వెల్ల‌డి
ఏ పార్టీలు, ఏ ఏజెన్సీ స‌ర్వే చేసినా ఇదే రిపోర్టు వస్తుంది
తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు వ్యాఖ్య‌లు

Harish Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నార‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మ‌ళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాద‌ని ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బ‌హిరంగంగా వ్యాఖ్యానిస్తున్నార‌ని తెలిపారు. ఈసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ప‌లు స‌ర్వేల్లో వెల్ల‌డి అవుతుంద‌న్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, శ్రీనాథ్, ఇతర నాయకులకు హ‌రీశ్‌రావు గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నది అని చెప్పడానికి తెలంగాణ భవన్ లో ప్రతిరోజు జరుగుతున్న చేరికలే నిదర్శనం. పార్టీ మారిన దానం నాగేందర్‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రేపోమాపో ఎన్నిక‌లు రాబోతున్నాయి. రాష్ట్రంలో వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అని అన్ని స‌ర్వేల్లో తేలుతున్న‌ది. ఏ పార్టీలు, ఏ ఏజెన్సీ సర్వే చేసినా ఇదే రిపోర్టు వస్తున్నది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఎర్రగడ్డల వేయాల్సి వస్తే మొదలు రేవంత్ రెడ్డిని వేయాలి

రూ. 5 లక్షల కోట్ల అవినీతికి రేవంత్ పాల్పడ్డాడ‌ని రాజ‌గోపాల్ రెడ్డి అంటున్నారు. ఇంకో ఎమ్మెల్యే 20 శాతం లంచం ఇస్తేనే పని అవుతుందని అంటున్నారు. వాళ్ల ఎమ్మెల్యేలే తిరగబడుతుంటే ఆసహనానికి లోనవుతున్నడు. కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నడు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిచ్చి కుక్క కరిచింది, వీళ్లను తీసుకుపోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో వేయాలంటున్నడు. రేవంత్ పిచ్చి ఎంత పీక్స్‌కు పోయిందో అర్థం అవుతున్నది. ఎర్రగడ్డల వేయాల్సి వస్తే మొదలు రేవంత్ రెడ్డిని వేయాలి అని సూచించారు.

రోజుకు 80 వేల వాటర్ ట్యాంకర్లను కొనే పరిస్థితి

సిద్దిపేటలో ఇందిరమ్మ బీమా అని పెట్టి ఒక్క మాట మాట్లాడలేదు. అభివృద్ధితో కేసీఆర్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచారు. రేవంత్ ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీశారు. కేసీఆర్ ఉండగా నీళ్లకు బాధ లేదు, కరెంట్ బాధ లేదు, హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నరు. రేవంత్ పాలనలో రోజుకు 80 వేల వాటర్ ట్యాంకర్లను కొనే పరిస్థితి ఏర్ప‌డింది. కేసీఆర్ గోదావరి, కృష్ణా నీళ్లను తెచ్చి నీటి సరఫరా చేసిండు. ఇప్పుడేమో నీటి కొర‌త ఏర్ప‌డింది. కేసీఆర్ ఉచిత నల్లా ఇస్తే, ఇప్పుడు ఉత్త నల్లా అయ్యింది అని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

మ‌ళ్లా కాంగ్రెస్ వచ్చింది.. నీళ్ల బిందెలు వచ్చినయి

పీజేఆర్ ఉన్నప్పుడు ఖాళీ బిందెల ప్రదర్శన ఉండే. బీఆర్ఎస్ పాలనలో బంద్ అయ్యింది. మ‌ళ్లా కాంగ్రెస్ వచ్చింది.. నీళ్ల బిందెలు వచ్చినయి. కరెంట్ కోతలు మొదలైనయి. రాష్ట్రానికి రెండేళ్ల నుంచి పరిశ్రమలకు కార్యదర్శి లేడు. ఐటీకి సెక్రెటరీ లేడు. నువ్వేం పరిశ్రమలను ఆకర్షిస్తవు నీ బొంద రేవంత్ రెడ్డి. చీఫ్ సెక్రెటరీకి ఇంచార్జీ ఇచ్చారు. వారికి సమయం ఉంటుందా? దృష్టి పెట్టగలరా..? మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ గురించి మాట్లాడుతారా..? గతేడాది తెలంగాణ రైజింగ్ పెట్టావు. ఎన్ని పరిశ్రమలు వచ్చినయి వైట్ పేపర్ విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు.

5 లక్షల సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి

కేసీఆర్ 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టించారు. అందులో ఈరోజు 5 లక్షల సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి. నువ్వే హోం మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి శాంతి భద్రతలు లేవు. మున్సిపాలిటీలో చెత్త ఎత్తుత లేవు అంటడు రేవంత్ రెడ్డి. నువ్వే మున్సిపల్ మంత్రి మ‌రి. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా తాగు నీటి సమస్య, దోమల సమస్య ఉంద‌న్నారు.

Advertisement
Advertisement