త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Trap | వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ACB Trap | వితంతువు జీవితానికి ఆసరాగా నిలవాల్సిన పింఛన్‌ మంజూరుకు రూ.10 వేలు డిమాండ్‌ చేసిన పంచాయతీ కార్యదర్శి.. లంచం సొమ్ము తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కాడు. పేద కుటుంబానికి అందాల్సిన ప్రభుత్వ సాయాన్ని సైతం అవినీతికి ఆసరాగా మార్చుకున్న కార్య‌ద‌ర్శిని అధికారులు వ‌లేసి ప‌ట్టుకున్నారు.

P

Telangana | Published On Nov 21, 2026, 3.23 pm IST

ACB Trap | వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
Advertisement

ACB Trap | వితంతువు జీవితానికి ఆసరాగా నిలవాల్సిన పింఛన్‌ మంజూరుకు రూ.10 వేలు డిమాండ్‌ చేసిన పంచాయతీ కార్యదర్శి.. లంచం సొమ్ము తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కాడు. పేద కుటుంబానికి అందాల్సిన ప్రభుత్వ సాయాన్ని సైతం అవినీతికి ఆసరాగా మార్చుకున్న కార్య‌ద‌ర్శిని అధికారులు వ‌లేసి ప‌ట్టుకున్నారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవన్‌లాల్‌ శుక్రవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిర్యాదుదారుడి కోడలికి వితంతు పింఛన్‌ మంజూరు చేయించేందుకు సంబంధిత అధికారి రూ.10 వేలు డిమాండ్‌ చేశాడు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసి, పింఛన్‌ మంజూరుకు అవసరమైన అనుమతులు ఇప్పించేందుకు లంచం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో శనివారం ఫిర్యాదుదారుడి నివాసం వద్ద లంచం సొమ్మును వ్యక్తిగతంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్ము రూ.10 వేలను స్వాధీనం చేసుకున్నారు. అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ వెల్లడించింది. నిందితుడిని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఈ సంద‌ర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్‌ నంబర్‌ 9440446106, ఫేస్‌బుక్‌ (Telangana ACB), ఎక్స్‌ (@Telangana ACB) త‌దిత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement