త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | సేవే ప్ర‌ధాన ల‌క్ష్యం కావాలి : ప్ర‌ధాని మోదీ

PM Modi | గుజ‌రాత్ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ బీజేపీ పాల‌నా విలువ‌ల‌కు సేవ అనేది ఎప్పుడూ మార్గ‌ద‌ర్శ‌క సూత్రం అని ప్ర‌ధాని మోదీ (PM Modi) స్ప‌స్టం చేశారు.

D

National | Published On Sep 24, 2026, 12.46 pm IST

PM Modi | సేవే ప్ర‌ధాన ల‌క్ష్యం కావాలి : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర న్యూస్ : గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఢిల్లీలో ప్రధానిగా కొనసాగుతున్నంత వరకూ బీజేపీ పాలనా విలువలకు ‘సేవ’ అనేది ఎల్లప్పుడూ మార్గదర్శక సూత్రం అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. ఎంత రాజకీయ అధికారం ల‌భించినా తాము సేవా మార్గం నుంచి వైదొలగబోమని పేర్కొన్నారు.

ప్రధాని 76వ పుట్టినరోజు, ప్రజా ప్రతినిధిగా ఆయన ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజ‌రాత్ వ‌డ్ల‌న‌గ‌ర్ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి వ‌ర‌కూ సాగుతున్న సేవా సంక‌ల్ప యాత్ర (Seva Sankalp Yatra)లో పాల్గొంటున్న యువ‌త‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. కేవలం ప్రసంగాలు ఇవ్వడం కాకుండా, చేతల ద్వారానే సేవా భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ఎంతటి ఉన్నత రాజకీయ పదవులు, అధికారాలు పొందినప్పటికీ మన గమ్యస్థానం 'సేవ' మాత్రమేనని.. సేవా పరమో ధర్మః (Seva Parmo Dharma) అనే సిద్ధాంతంతో ముందుకు సాగాలని సూచించారు.

తన జీవిత ప్రయాణానికి ప్రజల ఆశీస్సులే ప్రధాన శక్తిగా నిలిచాయని ప్రధాని ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. సేవా భావంతో చేసిన పనులను ప్రజలు గుర్తుంచుకుంటార‌ని.. సేవ చేసే వారికి ప్రజల ఆశీస్సులు లభిస్తాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా యాత్రలో పాల్గొంటున్న వారిని ప్ర‌ధాని అభినందించారు. తమ ఆరోగ్యం, భద్రతపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

'సేవా సంకల్ప్‌ యాత్ర'లో మొత్తం 20 బృందాలు పాల్గొంటున్నాయి. సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 7 వరకు సుమారు 35,500 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. ఇది కేవలం మోటార్‌సైకిల్‌ యాత్ర మాత్రమే కాదు.. యాత్ర మార్గంలో పట్టణాలు, జిల్లాలు, తాలూకాలు, గ్రామాల్లో ఆగుతూ స్థానిక ప్రజలను కలుసుకుని, అక్కడి అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టేలా యాత్రను రూపొందించారు. చెరువులు, పాఠశాలలు, ఆలయాలు, ఆసుపత్రులలో స్వచ్ఛతా అభియాన్‌, గ్రామ సభలు, గోసేవ, అలాగే ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ కింద మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లాకు చేరుకుంది.

Also Read..

దానం నాగేంద‌ర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

బ్యాంకుల స‌మ్మె ఎఫెక్ట్‌.. ఉద్యోగుల‌కు ముంద‌స్తు జీతాలు

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి

Advertisement
Advertisement