త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zia Chat | జియా చాట్‌ను లాంచ్ చేసిన జోహో.. ఉద్యోగుల‌కు ప‌వ‌ర్‌ఫుల్ టూల్‌..

Zia Chat | టెక్ దిగ్గ‌జ సంస్థ జోహో జియా చాట్ పేరుతో కొత్త కృత్రిమ మేధస్సు ఆధారిత ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్యాలయాల్లో ఉద్యోగులు ఉపయోగించే వివిధ జోహో అప్లికేషన్లలోని సమాచారాన్ని సులభంగా వెతకడం, సందర్భాన్ని అర్థం చేసుకోవడం, అవసరమైన పనులను పూర్తి చేయడం జియా చాట్ ద్వారా సాధ్యమవుతుంది.

S

Technology | Published On Sep 24, 2026, 11.50 am IST

Zia Chat | జియా చాట్‌ను లాంచ్ చేసిన జోహో.. ఉద్యోగుల‌కు ప‌వ‌ర్‌ఫుల్ టూల్‌..
Advertisement

Zia Chat | టెక్ దిగ్గ‌జ సంస్థ జోహో జియా చాట్ పేరుతో కొత్త కృత్రిమ మేధస్సు ఆధారిత ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్యాలయాల్లో ఉద్యోగులు ఉపయోగించే వివిధ జోహో అప్లికేషన్లలోని సమాచారాన్ని సులభంగా వెతకడం, సందర్భాన్ని అర్థం చేసుకోవడం, అవసరమైన పనులను పూర్తి చేయడం జియా చాట్ ద్వారా సాధ్యమవుతుంది. అదే సమయంలో రిటైల్, ఆటోమొబైల్, బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సర్వీసెస్-ఇన్సూరెన్స్, ఆరోగ్య సంరక్షణ, విద్య, రియల్ ఎస్టేట్, రెస్టారెంట్లు వంటి ఏడు రంగాల కోసం ప్రత్యేక అప్లికేషన్లతో వర్టికల్ సాస్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు జోహో ప్రకటించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జోహో సంస్థ ప్రకారం 2025లో భారత్‌లో సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 47 శాతం పెరిగింది. జోహో వర్క్‌ప్లేస్, జోహో వన్, జోహో సీఆర్‌ఎం, జోహో బుక్స్, జోహో పీపుల్ వంటి అప్లికేషన్లతోపాటు ఐటీ-ఐటీఈఎస్, తయారీ, బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సర్వీసెస్-ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో వృద్ధి నమోదైందని కంపెనీ తెలిపింది. ఆటోమొబైల్ రంగంలోనూ వినియోగదారుల ఆదరణ పెరుగుతోందని పేర్కొంది.

ఒకే చాట్‌తో సమాచారం నుంచి పనుల వరకు..

జోహో బిజినెస్ అప్లికేషన్ల వ్యవస్థలోనే జియా చాట్‌ను అనుసంధానించారు. వినియోగదారులు వేర్వేరు అప్లికేషన్లలోని సమాచారం కోసం ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేకుండా, సంభాషణ రూపంలో సమాచారం తెలుసుకోవచ్చు. వినియోగదారుడికి అనుమతి ఉన్న అప్లికేషన్లు, మాడ్యూళ్లు, ఫీల్డులు, రికార్డుల ఆధారంగా జియా చాట్ పనిచేస్తుంది. సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, మానవ వనరులు, ఆర్థిక విభాగాల్లో సంభావ్య కస్టమర్లు, ప్రస్తుత కస్టమర్లు, ఇతర వ్యాపార సమాచారాన్ని వెతకడం, లీడ్లను రూపొందించి అర్హతను పరిశీలించడం, కస్టమర్ సమస్యలను పరిష్కరించడం, ఇన్వాయిస్‌లు, ఆర్థిక వివరాలను నిర్వహించడం వంటి పనులను జియా చాట్ చేస్తుంది. రికార్డులను సేకరించి సంక్షిప్తీకరించడం, వ్యాపార డేటాను విశ్లేషించడం, నివేదికలు, చార్టులు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లు, ప్రతిపాదనలు, ఫాలో-అప్ ఈమెయిళ్లను రూపొందించడం కూడా సాధ్యమవుతుంది.

ఒకే సంభాష‌ణ‌తో ప‌ని పూర్తి..

జియా చాట్ ఒకే సంభాషణలో పనులను కూడా పూర్తి చేస్తుంది. ఉదాహరణకు పనులను సృష్టించడం లేదా అప్పగించడం, తరచూ ఎదురవుతున్న కస్టమర్ సపోర్ట్ సమస్యలను మేనేజ్‌మెంట్‌కు తెలియజేయడం, నిల్వలు తగ్గినప్పుడు ఇన్వెంటరీ బృందాలకు హెచ్చరికలు పంపడం, పునరావృత నివేదికలను షెడ్యూల్ చేయడం వంటివి చేయవచ్చు. ఒక సేల్స్ ఉద్యోగి ఒక కస్టమర్ ఖాతాకు సంబంధించిన గత పరస్పర చర్యలను పరిశీలించి, సపోర్ట్ సమస్యలు, చెల్లింపుల చరిత్రను సంక్షిప్తంగా ఇవ్వాలని జియా చాట్‌ను అడగవచ్చు. అనంతరం సంబంధిత రిస్క్‌లను గుర్తించి, ప్రజెంటేషన్ సిద్ధం చేయడంతోపాటు ఫాలో-అప్ ఈమెయిల్ తయారు చేసి, అవసరమైన పనులను కూడా సృష్టించవచ్చు. జియా చాట్ సంబంధిత వ్యాపార సంస్థలు, వ్యక్తులు, రికార్డులు, వాటి మధ్య సంబంధాలను గుర్తించేందుకు సెమాంటిక్ సెర్చ్, రిజాల్వర్స్, వర్క్ గ్రాఫ్, ప్రాక్సిమిటీ సిగ్నల్స్ వంటి సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఎంసీపీ అనుసంధానాల ద్వారా బాహ్య అప్లికేషన్లు, ఇతర వ్యవస్థలను కూడా జియా చాట్‌తో అనుసంధానించవచ్చు.

ఏడాదికి రూ.12 లక్షల వరకు బిల్లింగ్ చేసే వ్యాపారాలు జోహో పీఓఎస్ ఫర్ రెస్టారెంట్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జోహో క్యాంపస్ తొలుత భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తులో మరిన్ని రంగాలకు వర్టికల్ సాస్ సేవలను విస్తరించనున్నట్లు జోహో వెల్లడించింది.

Advertisement
Advertisement