త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain | రానున్న 24 గంట‌ల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు..

Heavy Rain | రానున్న 24 గంట‌ల్లో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని (Heavy Rain) వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

G

Telangana | Published On Sep 24, 2026, 11.55 am IST

Heavy Rain | రానున్న 24 గంట‌ల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు..
Advertisement

Heavy Rain | త్రినేత్ర‌.న్యూస్‌: రానున్న 24 గంట‌ల్లో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని (Heavy Rain) వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్ర‌భావంతో 3 రోజుల పాటు (24, 25, 26 తేదీల్లో) రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వాన‌లు ప‌డ‌తాయ‌ని వెల్ల‌డించింది. దీంతో ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ (Red Alert) జారీచేసింది. గురువారం ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్ద‌ప‌ల్లి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అదేవిధంగా సూర్యాపేట‌, హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్‌, జ‌న‌గామ‌, క‌రీంన‌గ‌ర్‌, జ‌గిత్యాల‌, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్‌, నిర్మ‌ల్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని చెప్పింది. న‌ల్ల‌గొండ‌, భువ‌న‌గిరి, సిద్దిపేట‌, నిజామాబాద్‌, మెద‌క్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని పేర్కొంది. కాగా, వ‌చ్చే 2 గంట‌ల్లో సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబాబాద్‌, కొత్త‌గూడెం, ములుగులో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

గ‌త 24 గంట‌ల్లో ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్ష‌పాతం న‌మోద‌యింద‌ని తెల‌పింది. అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలోని తిరుమ‌లాయ‌పాలెంలో 130.3 మిల్లీమీట‌ర్లు, ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌లో 114 మి.మీ., ధ‌ర్మ‌సాగ‌ర్ (హ‌నుమ‌కొండ‌) 110.3, నెల్లికుదురు (మ‌హ‌బూబాబాద్‌) 108.8, ఘ‌ట్‌కేస‌ర్ (మేడ్చ‌ల్‌) 15.8, కుత్భుల్లాపూర్ 13, వన‌స్థ‌లిపురం 13 మి.మీ. చొప్పున వ‌ర్ష‌పాతం న‌మోద‌యింది.

 

Advertisement
Advertisement