Romantic OTT | తనకంటే వయసులో చిన్నవాడైన హీరోతో నయనతార రొమాన్స్ – ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ
లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన తమిళ మూవీ హాయ్ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 25 నుంచి జీ5 ఓటీటీలో తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Sep 24, 2026, 12.05 pm IST
Romantic OTT | లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తూ భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి హాయ్ సినిమాను నిర్మించింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కెవిన్ హీరోగా నటించాడు. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించాడు.
వయసులో చిన్నవాడైన హీరో....
నయనతార హీరోయిన్, ప్రొడ్యూసర్ కావడంతో రిలీజ్‌కు ముందు హాయ్ మూవీపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ తనకంటే వయసులో చిన్నవాడైన హీరోతో రొమాంటిక్ మూవీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మూవీ రీచ్ కాలేకపోయింది. హాయ్ డిజాస్టర్‌గా నిలిచింది. నయనతారకు నష్టాలను తెచ్చిపెట్టింది.
ఓటీటీలోకి....
తాజాగా ఈ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 25 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగులో హాయ్ మూవీ రిలీజ్ అవుతోంది. తమిళ దిగ్గజ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ నటించిన చివరి మూవీ ఇది. ఈ సినిమాలో సీనియర్ హీరోహీరోయిన్లు రాధిక శరత్‌కుమార్, ప్రభు, సుహాసిని కీలక పాత్రల్లో కనిపించారు. దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో పదకొండు కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది. కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడం, ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో హాయ్ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
సుబ్రహ్మణ్యం ....
సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులే లోకంగా బతుకుంటాడు. ప్రేమ వివాహం చేసుకోవాలని కలలు కంటాడు. ప్రాణంగా ప్రేమించిన మరదలికి తన లవ్‌ను ప్రపోజ్ చేస్తాడు. ఆమె రిజెక్ట్ చేయడంతో హైదరాబాద్ వెళ్లిపోతాడు. మరోవైపు తండ్రి బలవంతంగా కుదర్చిన ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకోవడానికి దేవసేన కూడా హైదరాబాద్ వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో దేవసేన, సుబ్రహ్మణ్యం ఒకే చోట ఉంటారు. భార్యాభర్తలుగా నాటకం ఆడాల్సివస్తుంది. ఆ డ్రామా వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
సెప్టెంబర్ 23, 2026

Nayanthara | లేడి సూపర్ స్టార్ అభిమానులకు పండగే..! ఒకే రోజు ఓటీటీలో నయన్ రెండు సినిమాలు..?
సెప్టెంబర్ 23, 2026

Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ – 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Heavy Rain | రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
- ●Jharkhand minister | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి
- ●Zia Chat | జియా చాట్‌ను లాంచ్ చేసిన జోహో.. ఉద్యోగులకు పవర్ఫుల్ టూల్..
- ●Employees | బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. ఉద్యోగులకు ముందస్తు జీతాలు
- ●Ganesh Laddu Auction | కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో రూ.కోటి పలికిన గణేశ్ లడ్డూ వేలం..
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.15వేలు తగ్గిన పసిడి ధర.. ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక..

Heavy Rain | రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

Jharkhand minister | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి

Zia Chat | జియా చాట్‌ను లాంచ్ చేసిన జోహో.. ఉద్యోగులకు పవర్ఫుల్ టూల్..

Employees | బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. ఉద్యోగులకు ముందస్తు జీతాలు



