Sharad Pawar | త్వరలో ఎన్డీఏలోకి శరద్ పవార్.. శివసేన మంత్రి సంచలన వ్యాఖ్యలు
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఉద్దవ్ ఠాక్రే శివసేన.. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనతో జట్టు కట్టిందని, కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ చర్చలు జరుపుతోందని జయంత్ పాటిల్ తెలిపారు.
సంక్షిప్త సారాంశం
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్డీఏతో జతకట్టనున్నారా? ఈ సమయంలో ఎన్డీఏలో చేరడం వల్ల ఆయన వర్గానికి వచ్చే లాభం ఏంటి? మహా వికాస్ అఘాడిలో భాగస్వామ్యంగా ఉన్న శరద్ పవార్ వర్గం ఇప్పుడు ఎన్డీఏతో జతకడితే మహా యుతిలో చేరినట్లే అవుతుంది. ఓవైపు మహా యుతి కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉంది. మరోవైపు మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శరద్ పవార్ అడుగు ఎటువైపు?
Sharad Pawar | ఏ రాష్ట్ర రాజకీయాలు అర్థం అయినా మహారాష్ట్ర రాజకీయాలు మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు. ప్రాంతీయ పార్టీలు రెండే కానీ.. వాటిలో కూడా చీలికలు.. కేంద్ర పార్టీలకు ఒకరు మద్దతు ఇవ్వడం, మరొకరు ఇవ్వకపోవడం.. ప్రభుత్వాలు కూడా అలాగే ఏర్పడతాయి. తాజాగా మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అలజడి మొదలైంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ త్వరలో ఎన్డీయే(NDA) కూటమిలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఆధారం లేనివి అయితే పెద్దగా ఎవ్వరూ దీని గురించి పట్టించుకునేవారు కాదు. కానీ.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. శివసేన పార్టీకి చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన మంత్రి సంజయ్ షిర్సాత్. ప్రస్తుతం మహారాష్ట్రలో మూడు పార్టీలు కలిసి మహా యుతిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో రెండు ప్రాంతీయ పార్టీలు కలిశాయి. ఆ ప్రాంతీయ పార్టీలు కూడా రెండుగా చీలాయి. చీలిన ఒక వర్గం మాత్రం ఎన్డీఏకు మద్దతు ఇవ్వడంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడింది.
ఎన్‌సీపీలో చీలిన రెండు వర్గాల్లో ఒకటి అజిత్ పవార్ వర్గం కాగా, మరోటి శరద్ పవార్ వర్గం. నిజానికి ఎన్‌సీపీ పార్టీ అధినేత శరద్ పవార్ అయినప్పటికీ.. అజిత్, శరద్ పవార్ మధ్య విభేదాలు రావడంతో ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. తాజాగా శరద్ పవార్ కూడా ఎన్డీఏలో త్వరలో చేరబోతున్నారంటూ ఆ రాష్ట్ర మంత్రియే చెప్పడం మహారాష్ట్ర రాజకీయాలను యూటర్న్ తిప్పింది.
Sharad Pawar | అజిత్ పవర్ వర్గంతో పొత్తుకు శరద్ పవార్ రెడీ
నిజానికి త్వరలో పూణేలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం శరద్ పవార్ వర్గం.. అజిత్ పవార్ వర్గంతో పొత్తుకు సై అన్నట్లుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలో శరద్ పవార్ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఉద్దవ్ ఠాక్రేతో శరద్ చేతులు కలుపుతారని ఊహించామా?
భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు.. శరద్ పవార్ ఎన్డీయేలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఉద్దవ్ ఠాక్రేతో గతంలో శరద్ పవార్ చేతులు కలపలేదా? ఎవరో ఆ పొత్తును ఊహించారా? సోనియా గాంధీని వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన శరద్.. మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? ఆయన రాజకీయ శైలి ఇలాగే ఉంటుంది. అజిత్ పవార్ వర్గంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకోవడం అనేది భవిష్యత్తు రాజకీయాల్లో కీలక మార్పునకు సంకేతం అని సంజయ్ షిర్సాత్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి వాటిని మేం సీరియస్‌గా తీసుకోం
మంత్రి సంజయ్ వ్యాఖ్యలపై శరద్ పవార్ వర్గం స్పందించింది. నిరాధారమైన ఆరోపణలు అవి. మా చిత్తశుద్ధిపై అనుమానం కలిగించేందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని మేం సీరియస్‌గా తీసుకోం. మా పార్టీకి కార్పొరేటర్ల బలం ఎక్కడ ఎక్కువగా ఉందో.. అక్కడ బీజేపీకి అడ్డుకట్ట వేయడానికే అజిత్ పవార్ వర్గంతో చర్చలు జరుపుతున్నామని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ స్పష్టం చేశారు.
చీలిక దిశగా మహా వికాస్ అఘాడి
ఈనేపథ్యంలో మహా యుక్తి కాకుండా మహా వికాస్ అఘాడిగా ఏర్పడిన పార్టీల మధ్య తాజాగా విభేదాలు బయటపడుతున్నాయి. ఈ కూటమిలో ఉన్న ఉద్దవ్ ఠాక్రే వర్గం అయిన శివసేన, శరద్ పవార్ వర్గం అయిన ఎన్‌సీపీ, సీపీఐ(ఎం), సీపీఐ.. ఈ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల వేళ తమకు నచ్చిన దారి చూసుకుంటున్నాయి. అందుకే ఎన్నికల సమయంలో ఏర్పడిన మహా వికాస్ అఘాడి చీలిక దిశగా అడుగులు వేస్తోంది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఉద్దవ్ ఠాక్రే శివసేన.. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనతో జట్టు కట్టిందని, కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ చర్చలు జరుపుతోందని జయంత్ పాటిల్ తెలిపారు.
ఈనేపథ్యంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న అజిత్ పవార్ వర్గంతో శరద్ పవార్ చర్చలు జరపడం వల్ల కాంగ్రెస్ పార్టీ, ఉద్దవ్ ఠాక్రే వర్గం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026

BJP | ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు.. 21కి చేరిన బీజేపీ పాలిత రాష్ట్రాలు..
మే 4, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



