త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

S

Telangana | Published On Dec 22, 2025, 11.00 am IST

Road Accident | మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్ : మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండ‌ల ప‌రిధిలో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందారం ఎక్స్ రోడ్డు వ‌ద్ద ఆగి ఉన్న బొలెరో వాహ‌నాన్ని వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్ట‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. బొలెరో వాహ‌నంలో మ‌హారాష్ట్ర నుంచి 23 మంది కూలీల‌తో క‌రీంన‌గ‌ర్‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ముగ్గురి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్షత‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement