KTR | సీఎం.. నీకు సిగ్గు, లజ్జ ఉంటే సక్కగ పాలించు.. పనికిమాలిన కేసులొద్దు: కేటీఆర్
KTR | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి సిగ్గు, లజ్జ ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పనికిమాలిక కేసులతో వేధింపులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేసి, బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు.
- అక్రమ కేసులు కాదు, పరిపాలన మీద దృష్టి పెట్టు
- రైతులు అల్లాడుతున్నరు
- నిన్న కరీంనగర్‌లో కాల్పలు జరిగినయ్
- శాంతి భద్రతలు కాపాడు
- పోలీసులు నీ ప్రైవేటు ఆర్మీనా
- 420 హామీలు, 13 డిక్లరేషన్లు అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటం
- మన్నె క్రిశాంక్ పరామర్శలో రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజం
KTR | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి సిగ్గు, లజ్జ ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పనికిమాలిక కేసులతో వేధింపులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేసి, బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. సోమవారం సంగారెడ్డి జైలులో మన్నె క్రిశాంక్(Manne Krishank) ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు.
నేడు రాష్ట్రంలో కేసులు, పనికిమాలిన వేధింపులు చూస్తున్నం. క్రిశాంక్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక ధృవతారగా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పోరాటం చేశాడు. స్వయంగా తాను న్యాయవాది కూడా. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా బయట పెడుతున్నాడు. ప్రజల అరాచకాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్నడు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నడు. ఆయన మీద కోపంతో ఇవాళ పనికిమాలిన కేసులు పెట్టారు. నాలుగేళ్లకు తక్కువ శిక్ష పడే కేసులే. స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసులవి. కానీ నేటితో 12వ రోజు జైల్లో ఉండి. ప్రతిసారీ ఇలాగే చేస్తున్నడని దాదాపు 35 కేసులు పెట్టారు అని కేటీఆర్ చెప్పారు.
సీఎం పైశాచికానందం..
మిస్ ఇంగ్లండ్‌ను ఇద్దరు కాంగ్రెస్ నేతలు లైంగికంగా వేధించారని మాట్లాడినందుకు, దాన్ని వ్యతిరేకించినందుకు ఆయనపై కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి అల్లుడు, వారి బినామీ కంపెనీలు వాటికి సంబంధించిన బాగోతాలు బయటపెడితే ఒక కేసు. రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డికి కాంట్రాక్టులు ఎలా ఇస్తారని, కేంద్రం మీరు కుమ్మక్కయ్యారని అది బయటకు తీసుకొస్తే మరొక కేసు. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచిని భయపెట్టి ఆయన చావుకు కారణమయ్యారని నిలదీస్తే దానిమీద ఒక కేసు. ఈ రకంగా 35 కేసులు మన్నె క్రిశాంక్ మీద పెట్టారు. అతనితో పాటు మరో పదిమంది కార్యకర్తలను జైల్లో పెట్టి వారి వారి కుటుంబాలకు క్షోభ కలిగిస్తున్నారు. సీఎం పైశాచికానందం పొందుతున్నారు అని ఆయన మండిపడ్డారు.
నేరాలు, అరాచకాలపై సోయి లేదా?
బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టే శ్రద్ధ ఒక్క పైసా రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై, అరాచకాలపై దృష్టి పెట్టండి. నిన్న కరీంనగర్‌లో పట్టపగలే ఒక జ్యువెలరీ దుకాణంలో నలుగురిపై కాల్పులు జరిగాయి. వాళ్లు చావుబతుకుల మధ్య కొట్లాడుతున్నరు. ఇట్లాంటివి వదిలేసి సోషల్ మీడియాలో ఎవరు ట్వీట్ పెట్టారు.. పరువు ఏమవుతుంది అని ఆలోచిస్తున్నరేమో. అసలు మీకు పరువుంటేగా పోవడానికి. నీకు సిగ్గు, లజ్జ ఉంటే ఇచ్చిన హామీలు అమలు చెయ్. అలా కాకుండా తప్పించుకొని తిరుగుతున్నవ్. మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నరో వినే ప్రయత్నం చేయండి. మా నాయకులను వేధిస్తే కొంత తాత్కాలిక ఇబ్బంది ఉంటదేమో. కానీ భయపడేది లేదు. వెనక్కి తగ్గేది లేదు. నీ 420 హామీలు, 13 డిక్లరేషన్లు అమలు చేసే దాకా మేం ప్రశ్నిస్తూనే ఉంటం. పోరాడుతూనే ఉంటం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హెచ్చరించారు.
హైకోర్టు చెప్పినా..
ఒక కేసులో క్రిశాంక్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. పోలీసులేమో అతి చేస్తున్నరు. కోర్టు తీర్పును తుంగలో తొక్కారు. పోలీసు యంత్రాంగం ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీలాగా పని చేస్తుంది. మా ఇండ్ల మీదికొచ్చి సీసీ కెమెరాలు హ్యాక్ చేయడం, మా ఫోన్లు హ్యాక్ చేయడం. బెంగళూరు నుంచి హ్యాకర్లను తెచ్చి ఫోన్లను హ్యాక్ చేయడం. ఎవరెవరు ఏమేం మాట్లాడుతున్నరో తెలుసుకొనే ప్రయత్నం చేయడం. జర్నలిస్టులను ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం. వారి ఫోన్లను కూడా ఇవాళ గమనించడం.. ఇవన్నీ పనికి మాలినవి పనులు అని కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..
ఈ అరాచకాలకు భయపడం, సీఎం రేవంత్.. ఇంతకు ఇంత చెల్లించుకుంటవ్. నువే బాధపడే రోజు వస్తది. హ్యాకింగ్లు, ట్యాపింగ్‌లు, డ్రామాలు, జైల్లు ఇవి బంద్ పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టు. రైతులు అల్లాడిపోతున్నరు. వాళ్లను చూడు. రాష్ట్రంలో నేరాలను అరికట్టు. ఇవన్నీ వదిలేసి మమ్మల్ని వేధించే పని పెట్టుకున్నవ్. తప్పకుండా మూల్యం చెల్లించుకుంటవ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా సోషల్ మీడియా ప్రతినిధులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎవరూ కూడా అధైర్యపడొద్దు. మీకు ఏది జరిగినా బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంటది అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



