Prakash Raj | గణపతి నిమజ్జనం పూర్తైంది.. ఇక జ్ఞానేశ్ వంతు.. ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Prakash Raj | "దేశంలో గణపతి నిమజ్జనం పూర్తైంది. ఇక జ్ఞానేశ్ కుమార్ నిమజ్జనమే మిగిలి ఉంది" అంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Prakash Raj | త్రినేత్ర న్యూస్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో గణపతి నిమజ్జనం విజయవంతంగా పూర్తైందని.. ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ వంతు మిగిలుందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఈసీకి వ్యతిరేకంగా బహిరంగ ఆందోళనకు పిలుపునిచ్చిన 'కాక్రోచ్ పార్టీ'కి (Cockroach Party) మద్దతు ప్రకటిస్తూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు.
తమ హక్కుల పరిరక్షణ కోసం శాంతియుత నిరసనల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి రోజే ఆయన హంతకుడు గాడ్సేని కీర్తించే కొన్ని దుష్ట శక్తులు దేశంలో తిరుగుతున్నాయని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. సర్ ద్వారా మన పౌరసత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది వీళ్లేనని వ్యాఖ్యానించారు. దేశ యువత, పౌర సమాజం, కాక్రోచ్‌లు వారి ప్రయత్నాలను అడ్డుకుంటాయని స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ, ముంబైలో నిర్వహించ తలపెట్టిన శాంతియుత నిరసనల్లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. "దేశంలో గణపతి నిమజ్జనం పూర్తైంది. ఇక జ్ఞానేశ్ కుమార్ నిమజ్జనమే మిగిలి ఉంది" అంటూ వీడియోని ముగించారు.
Also Read..
సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
అక్టోబర్ 2, 2026

Rahul Gandhi | ఫారమ్-6లో మార్పులు చేయమని టీసీఎస్‌ను ఎవరు ఆదేశించారు..? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన రాహుల్
అక్టోబర్ 1, 2026

University Men’s Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●CJI Surya Kant | న్యాయమూర్తుల స్థానాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదు : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- ●Telangana Schools | తెలంగాణ స్కూల్ విద్యార్థులకు అలర్ట్..!
- ●Direct-to-Mobile | ఇక ఇంటర్నెట్ లేకున్నా ఫోన్లో నేరుగా లైవ్ టీవీ.. కేంద్రం సన్నాహాలు..?
- ●Nushrratt Bharuccha | విహారయాత్రలో విషాదం - తీవ్రంగా గాయపడిన ఛత్రపతి హీరోయిన్
- ●Bandi Sanjay | ఇప్పుడున్నది ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. మేమే అసలైన గాంధీ వారసులం
- ●Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం - మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్

CJI Surya Kant | న్యాయమూర్తుల స్థానాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదు : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

Telangana Schools | తెలంగాణ స్కూల్ విద్యార్థులకు అలర్ట్..!

Direct-to-Mobile | ఇక ఇంటర్నెట్ లేకున్నా ఫోన్లో నేరుగా లైవ్ టీవీ.. కేంద్రం సన్నాహాలు..?

Nushrratt Bharuccha | విహారయాత్రలో విషాదం - తీవ్రంగా గాయపడిన ఛత్రపతి హీరోయిన్



