Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
Jantar Mantar | ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి నేతలు శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిరసనలు చేపట్టారు.
Jantar Mantar | త్రినేత్ర న్యూస్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి నేతలు శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. 'సేవ్ డెమెక్రసీ' పేరుతో చేపట్టిన ఈ ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ఆప్, యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.
అప్రమత్తమైన పోలీసులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా గళం విప్పేందుకు మధ్యాహ్నం జెన్ జీ, మహిళలు, యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు రావాలని సౌరభ్ భరద్వాజ్ పిలుపునిచ్చారు.
#WATCH | Delhi AAP President Saurabh Bharadwaj, who arrived at Jantar Mantar to protest against the Election Commission, detained by police https://t.co/i1ZH0Q3Goq pic.twitter.com/9PFoWDoDS6
— ANI (@ANI) October 2, 2026
ఢిల్లీలో హై అలర్ట్
మరోవైపు ప్రతిపక్షాలు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. జంతర్ మంతర్‌ను మూసివేసిన అధికారులు అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులు ఆ ప్రాంతానికి రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుపెట్టారు. మరోవైపు ఆ ప్రాంతంలో డ్రోన్లతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నగర వ్యాప్తంగా 163 సెక్షన్ విధించారు.
Delhi Police tweets, "Section 163 BNSS is in force in New Delhi District." pic.twitter.com/yvpQhLEL6L
— ANI (@ANI) October 2, 2026
11 మెట్రో స్టేషన్లు మూసివేత
ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 11 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, సేవా తీర్థ్, మండి హౌస్, లోక్ కళ్యాణ్ మార్గ్, ఐఎన్ఏ, చావ్రి బజార్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌ను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (Delhi Metro Rail Corporation) ప్రకటించింది. అయితే, రాజీవ్ చౌక్, మండి హౌస్, న్యూఢిల్లీ, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌ఛేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Delhi Metro Rail Corporation says, "The entry and exit at the following metro stations will remain closed till further notice: Janpath, Patel Chowk, Central Secretariat, Rajiv Chowk, Seva Teerth, Mandi House, Lok Kalyan Marg, INA, Chawri Bazar, Ramakrishna Ashram Marg and New… pic.twitter.com/aLGhbJOPXY
— ANI (@ANI) October 2, 2026
#WATCH | Delhi | Police use drones for security surveillance in the Jantar Mantar area as AAP protests against the Election Commission here.
Activists, political leaders and civil society representatives had given a call for protest against the EC today. pic.twitter.com/BRXl3OBaTz
— ANI (@ANI) October 2, 2026
Also Read..
బస్సు కండక్టర్‌గా సీఎం విజయ్.. స్వయంగా టికెట్లు ఇచ్చి
140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
సర్ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్రత్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Prakash Raj | గణపతి నిమజ్జనం పూర్తైంది.. ఇక జ్ఞానేశ్ వంతు.. ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
అక్టోబర్ 2, 2026

EC orders special drive | సర్ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్రత్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం
అక్టోబర్ 2, 2026

Telangana CEO Form 6 Declaration | ఓటర్లకు సీఈవో కీలక ఆదేశాలు: ఆ ఒక్కటి లేకుంటే ఓటు కట్
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | ఇప్పుడున్నది ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. మేమే అసలైన గాంధీ వారసులం
- ●Prakash Raj | గణపతి నిమజ్జనం పూర్తైంది.. ఇక జ్ఞానేశ్ వంతు.. ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ●Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం - మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్
- ●Arattai Business | వాట్సాప్‌కు జోహో మరో సవాల్.. అరట్టై బిజినెస్ లైవ్..
- ●Governor, CM Revanth | మహాత్ముడికి గవర్నర్, ముఖ్యమంత్రి నివాళులు
- ●Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది

Bandi Sanjay | ఇప్పుడున్నది ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. మేమే అసలైన గాంధీ వారసులం

Prakash Raj | గణపతి నిమజ్జనం పూర్తైంది.. ఇక జ్ఞానేశ్ వంతు.. ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం - మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్

Arattai Business | వాట్సాప్‌కు జోహో మరో సవాల్.. అరట్టై బిజినెస్ లైవ్..



