త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | బ‌స్సు కండ‌క్ట‌ర్‌గా సీఎం విజ‌య్‌.. స్వ‌యంగా టికెట్లు ఇచ్చి

CM Vijay | గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో మహిళల కోసం విస్తరించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘వెట్రి పయనం’ (Vettri Payanam Thittam)ను ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ (CM Vijay) ఇవాళ అధికారికంగా ప్రారంభించారు. మ‌హిళ‌ల‌కు తానే స్వ‌యంగా టికెట్లు ఇచ్చారు.

D

National | Published On Oct 2, 2026, 1.12 pm IST

CM Vijay | బ‌స్సు కండ‌క్ట‌ర్‌గా సీఎం విజ‌య్‌.. స్వ‌యంగా టికెట్లు ఇచ్చి
Advertisement

CM Vijay | త్రినేత్ర న్యూస్ : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ బ‌స్సు కండ‌క్ట‌ర్ అవ‌తార‌మెత్తారు. ప్ర‌యాణికుల‌కు స్వ‌యంగా టికెట్లు ఇస్తూ క‌నిపించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో మహిళల కోసం విస్తరించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘వెట్రి పయనం’ (Vettri Payanam Thittam)ను సీఎం ఇవాళ అధికారికంగా ప్రారంభించారు. చెన్నైలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం విజయ్ స్వయంగా సాధారణ ప్రయాణికుడిలా బస్సు ఎక్కి మ‌హిళ‌ల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. వారికి తానే స్వ‌యంగా టికెట్లు ఇచ్చారు. వారితో కాసేపు ముచ్చ‌టించి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బ‌స్సెక్కిన పురుషుల‌కు కూడా సీఎం స్వ‌యంగా త‌న డ‌బ్బుల‌తోనే టికెట్లు తీసిచ్చారు.

2021లో డీఎంకే ప్రభుత్వం ‘కలైమగల్ మగిలిర్ విదియల్ పయనం’ పేరుతో ఈ ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అయితే కేవ‌లం సాధార‌ణ ప్ర‌భుత్వ టౌన్ బ‌స్సుల్లో మాత్ర‌మే మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ఉండేది. విజ‌య్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత ఈ ప‌థ‌కాన్ని విస్త‌రించారు. తాజా ప‌థ‌కం కింద సాధారణ బస్సులతో పాటు పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్ (LSS), డీలక్స్ బస్సుల్లో కూడా మహిళలు, విద్యార్థినులు, అలాగే ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ ప్ర‌యోజ‌నం అంతర్-జిల్లా బస్సు సర్వీసులకు కూడా వర్తిస్తుంద‌ని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12,692 ప్రభుత్వ బస్సుల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పథకం అమలు కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా సుమారు రూ.6,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప‌థ‌కం ద్వారా ప్రతిరోజూ దాదాపు 84 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు.

Also Read..

140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైల‌ట్ స్మిత్‌తో ప్రధాని మోదీ

స‌ర్ తర్వాత‌ ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్ర‌త్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వ‌ద్ద మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయ్ : పుతిన్

Advertisement
Advertisement