SIR | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫారం-6 నుంచి అదనపు డిక్లరేషన్ ఉపసంహరణ
SIR | ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫారం-6తో పాటు జత చేసిన అదనపు సర్ డిక్లరేషన్‌ను ఉపసంహరించుకుంది.
SIR | త్రినేత్ర న్యూస్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే వారికి సంబంధించిన ఫారం-6లో కీలక మార్పులు చేసింది. సర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫారం-6తో పాటు జత చేసిన అదనపు సర్ డిక్లరేషన్‌ను ఉపసంహరించుకుంది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలతో కూడిన పూర్తి స్థాయి కమిటీ సెప్టెంబర్ 26న సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఐఆర్ (SIR) కాలపరిమితి ముగిసిన తర్వాత ఈ అదనపు నిబంధన వర్తించదని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ఈ అదనపు డిక్లరేషన్ ఆప్షన్‌ను అధికారిక ECINET పోర్టల్, యాప్స్, సంబంధిత రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) వెబ్‌సైట్ల నుంచి తొలగించారు.
కాగా, ఈ అదనపు డిక్లరేషన్‌లో కొత్త దరఖాస్తుదారులు తాము లేదా తమ తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు గతంలో జరిగిన ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితాల్లో ఉన్నారనే వివరాలను అందించాల్సి ఉండేది. అయితే, నిబంధనలను సవరించకుండా చట్టబద్ధమైన ఫారమ్‌లలో ఇటువంటి మార్పులు చేయడంపై అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ మార్పులు చట్ట విరుద్ధం అంటూ గతంలో ఇద్దరు కమిషనర్లు సైతం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ వ్యవహారంపై వివాదం రాజుకుంది. ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లోని అదనపు సర్ డిక్లరేషన్‌ను ఈసీ తొలగించింది. ఈ నిర్ణయంతో సర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారులు ఇకపై రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960 ప్రకారం నిర్దేశించిన సాధారణ ఫారం-6ను మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, సర్ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ అదనపు డిక్లరేషన్ కొనసాగనుంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ మూడో విడత కొనసాగుతోంది.
Also Read..
బుద్గాంలో ఎన్‌కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●HBL Engineering | భారీగా రాబడి ఇచ్చిన షేర్.. రూ.1 లక్ష పెడితే రూ.53 లక్షలు వచ్చాయి..
- ●Flydubai Flight | హైజాక్ కోడ్.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!
- ●Padi Kaushik Reddy | రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎం : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
- ●Ethics Committee | ఏం తేల్చకుండానే ఎథిక్స్ కమిటీ సమావేశం ముగింపు
- ●MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ●HMD Vibe2 Pro 5G | హెచ్ఎండీ నుంచి కొత్త 5జి ఫోన్.. ధర రూ.14,999, అదిరే ఫీచర్లు..

HBL Engineering | భారీగా రాబడి ఇచ్చిన షేర్.. రూ.1 లక్ష పెడితే రూ.53 లక్షలు వచ్చాయి..

Flydubai Flight | హైజాక్ కోడ్.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!

Padi Kaushik Reddy | రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎం : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Ethics Committee | ఏం తేల్చకుండానే ఎథిక్స్ కమిటీ సమావేశం ముగింపు






