Balka Suman | సింగరేణిని అమ్మితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం
Balka Suman | సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతాన్ని ప్రయివేటు వాళ్లకు అమ్ముకోవాలని చూస్తోంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. సింగరేణి సంస్థను ఎవరికైనా అమ్మితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బాల్క సుమన్ హెచ్చరించారు.
Balka Suman | త్రినేత్ర న్యూస్ : సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతాన్ని ప్రయివేటు వాళ్లకు అమ్ముకోవాలని చూస్తోంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. సింగరేణి సంస్థను ఎవరికైనా అమ్మితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం చిరుమళ్ల రాకేష్ కుమార్, కౌశిక్ హరి, కె .కిషోర్ గౌడ్, బొమ్మెర రామ్మూర్తి, కురువ విజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, విద్యాసాగర్‌తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.

సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బొగ్గు గనుల ప్రయవేటీకరణ అడ్డుకుంటామని ప్రభుత్వం హామీ చెప్పింది. సింగరేణిని అవినీతి మయం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి కింగ్ పిన్‌గా అవినీతి జరుగుతోంది. జైపూర్ పవర్ ప్లాంట్‌లో 334 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. సింగరేణిలో40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారు. ఒక్కో కార్మికుడికి లాభాల్లో లక్షా 80 వేల కోట్లు తక్కువగా ఇస్తున్నారు. సింగరేణి డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ సోకులకు ఖర్చు పెట్టారు. సింగరేణి అవినీతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లెటర్ రాశారు. కార్మికులకు నికర లాభాల్లో 36 శాతం వాటా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారని బాల్క సుమన్ తెలిపారు.
కాంగ్రెస్‌కు బంగారు బాతులా సింగరేణి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారసత్వ ఉద్యోగాలు బంద్ చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 60 వేల కోట్ల బకాయి పడింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా తగ్గుతోంది. విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. డిప్యూటీ సీఎంతో పాటు అధికారులు, బంధువులు అందరూ కలిసి విదేశీ బొగ్గును సరఫరా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి నెల 3 సార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోంది. మారింది. సింగరేణి అంటే సిరుల గని అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
సిరుల సిల్లగా సిరిసిల్ల
అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్‌లో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, కార్మిక సంఘం నేతలతో కేటీఆర్ మీటింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 30వ తేదీ సాగర హారం జరిగింది. సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తే దక్షిణ భారతదేశంలో కరెంట్ ఉత్పత్తికి ఇబ్బందులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. కేటీఆర్ ఎమ్మెల్యే, మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల సిరుల సిల్లగా మారింది. సిరిసిల్లలో ఇరిగేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉందో రేవంత్ రెడ్డి చూడాలి అని సుమన్ అన్నారు.
రేవంత్ రెడ్డి సిరిసిల్లకు టూరిస్ట్ లాంటి వారు
రేవంత్ రెడ్డికి మైక్ దొరికితే తిట్టడం తప్ప వేరే పని లేదు. సిరిసిల్లకు రేవంత్ రెడ్డి ఎన్ని నిధులు ఇస్తారో చెప్పాలి. రేవంత్ రెడ్డి సిరిసిల్లకు టూరిస్ట్ లాంటి వారు. నాయకులను ఓడగొట్టడం, గెలిపించడం ప్రజల చేతుల్లో ఉంటుంది. టూరిస్టుల చేతుల్లో ఉండదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చుట్టూ రేవంత్ రెడ్డి రాజకీయం తిప్పుతున్నారు. రేవంత్ రెడ్డి స్వంత జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ప్రాజెక్టుల వద్ద పోలీసులు కాపలా ఉంటున్నారు. తెలంగాణకు 45 టీఎంసీలు ఇవ్వొద్దని సీడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. నాన్ బేసిన్ కుప్పంకు కృష్ణా నది నీళ్లను తరలించారు. గురువు కళ్ళల్లో ఆనందం కోసం రేవంత్ రెడ్డి తెలంగాణను ఎండబెడుతున్నారు. ఇంకో 20 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ మొలకెత్తదు అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ethics Committee | ఏం తేల్చకుండానే ఎథిక్స్ కమిటీ సమావేశం ముగింపు
సెప్టెంబర్ 30, 2026

MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
సెప్టెంబర్ 30, 2026

Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ●HMD Vibe2 Pro 5G | హెచ్ఎండీ నుంచి కొత్త 5జి ఫోన్.. ధర రూ.14,999, అదిరే ఫీచర్లు..
- ●SIR | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫారం-6 నుంచి అదనపు డిక్లరేషన్ ఉపసంహరణ
- ●Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన
- ●CAFE III | వాహనాలకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు.. 2027 నుంచి అమలు..
- ●Manjeera | అక్టోబర్ 2న మంజీరా రచయితల సంఘం మహాసభ

MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

HMD Vibe2 Pro 5G | హెచ్ఎండీ నుంచి కొత్త 5జి ఫోన్.. ధర రూ.14,999, అదిరే ఫీచర్లు..

SIR | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫారం-6 నుంచి అదనపు డిక్లరేషన్ ఉపసంహరణ

Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన



