త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌.. క‌రీంన‌గ‌ర్‌లో మ‌హా పాద‌యాత్ర‌

Nitin Nabin | బీజేపీ (BJP) జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ (Nitin Nabin) తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీ ఖ‌రార‌యింది. ఈ నెల 18న ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌కు రానున్నారు. ఈ నెల 2న ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌లో (Karimnagar) ప‌ర్య‌టించాల్సి ఉంది.

G

Telangana | Published On Nov 10, 2026, 12.16 pm IST

Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌.. క‌రీంన‌గ‌ర్‌లో మ‌హా పాద‌యాత్ర‌
Advertisement

Nitin Nabin | త్రినేత్ర న్యూస్‌: బీజేపీ (BJP) జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ (Nitin Nabin) తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీ ఖ‌రార‌యింది. ఈ నెల 18న ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌కు రానున్నారు. ఈ నెల 2న ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌లో (Karimnagar) ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే వివిధ కార‌ణాల‌తో అది ర‌ద్ద‌యింది. అదే రోజున హైద‌రాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మ‌హాపాద‌యాత్ర నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. కాగా, ‘సర్’ (SIR) పేరుతో రాజ్యాంగ సంస్థలపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో మ‌మా పాద‌యాత్ర‌లు (Maha Padayathra) నిర్వ‌హించాల‌ని బీజేపి నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా నితిన్ న‌బిన్ క‌రీంన‌గ‌ర్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో `మహా పాదయాత్ర’ను విజ‌య‌వంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) నిర్ణయించారు. ఈ మేరకు పాదయాత్రకు సంబధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు ఎంపీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా లక్ష మందిని స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.

'సర్' పై కాంగ్రెస్, ఇండీ కూటమి (INDIA)పేరుతో విపక్షాలు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఎన్నికల సంఘాన్ని నీరుగార్చే కుట్రలతో రాజ్యంగ సంస్థలపై దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయ‌న‌ మండిపడ్డారు. ప్ర‌జ‌ల‌కు వాస్తవాలను తెలియజేసేందుకే నితిన్ నబిన్ కరీంనగర్ వస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు కూడా హాజరుకానున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ కేంద్రాల నుంచి శక్తి కేంద్రాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కోరారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా మహా పాదయాత్రపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని సూచించారు. కాగా, గాంధీ సర్కిల్, వైశ్యా భవన్ నుండి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ దాకా ఈ పాదయాత్ర సాగ‌నుంది. ఇందులో నితిన్ నబిన్‌తో క‌లిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బండి సంజయ్ న‌డవ‌నున్నారు.

Advertisement
Advertisement