త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ న‌యా చ‌రిత్ర‌..!

PM Modi | భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం స‌రికొత్త రికార్డును నెల‌కొల్పారు. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన నేత‌గా చ‌రిత్ర సృష్టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు సిక్కీం మాజీ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండ‌గా.. ఆ రికార్డును మోదీ అధిగ‌మించారు.

P

National | Published On Mar 22, 2026, 3.19 pm IST

PM Modi | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ న‌యా చ‌రిత్ర‌..!
Advertisement
  • ఎక్కువ‌గా కాలం ప్ర‌భుత్వ అధినేత‌గా ప‌ని చేసిన నేత‌గా రికార్డు
  • సిక్కీం మాజీ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కుమార్ చామ్లింగ్‌ను దాటిన పీఎం

PM Modi | భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం స‌రికొత్త రికార్డును నెల‌కొల్పారు. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన నేత‌గా చ‌రిత్ర సృష్టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు సిక్కీం మాజీ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండ‌గా.. ఆ రికార్డును మోదీ అధిగ‌మించారు. చామ్లింగ్ ప్ర‌భుత్వ అధిప‌తిగా 8,930 రోజులు కొన‌సాగారు. తాజాగా ప్ర‌ధాని (8,931 రోజులు) ఆ రికార్డును దాటారు. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా భావిస్తున్నారు.

అత్య‌ధిక కాలం గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా..

మోదీ ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవ‌లందించిన నేత‌గా నిలిచారు. అలాగే ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం కలిగిన ప్రధానమంత్రిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చాక జ‌న్మించిన ప్ర‌ధాని మోదీ 2014, 2019, 2024లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా మూడుసార్లు బీజేపీకి విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. 2014 నుంచి పీఎం ప‌ద‌విలో కొన‌సాగుతున్న ఆయ‌న‌.. దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేత‌గా మోదీ ఘ‌న‌త సాధించారు. కేంద్రంలో రెండుసార్లు పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేసుకొని, మూడోసారి అధికారం చేపట్టిన కాంగ్రెసేతర పార్టీ నేతగా చ‌రిత్ర‌కెక్కారు.

నెహ్రూ, ఇందిర రికార్డులు బ‌ద్ద‌లు..

మూడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి విజయాన్ని సాధించిన నెహ్రూ రికార్డును సైతం అధిగ‌మించారు. గతేడాది జులైలో మోదీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి వరుసగా దేశంలో అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా రికార్డును నెల‌కొల్పారు. వరుసగా ఆరు ఎన్నికల్లో ఒకే ఒక పార్టీ నుంచి పార్టీ ప‌క్ష‌నేత‌గా ఎన్నికైన నేత సైతం మోదీయే. 2002, 2007, 2012లలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజ‌యం సాధించి, ముఖ్య‌మంత్రి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

త‌ల్లి ఉప‌దేశంతోనే..

గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రభుత్వాధిపతిగా 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజల జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ సమయంలో గుజరాత్ భూకంపం, తుఫాన్లు, కరువు వంటి సమస్యలతో ఇబ్బందులు ప‌డేద‌ని గుర్తు చేసుకున్నారు. ఆ సవాళ్లు తన సంకల్పాన్ని మ‌రింత బ‌లోపేతం చేశాయ‌న్నారు. తన తల్లి ఇచ్చిన “పేదల కోసం పనిచేయాలి.. లంచం తీసుకోకూడదు” అనే ఉపదేశ‌మే ప్రజాసేవకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. తన ప్ర‌భుత్వ‌ పాలనలో గుజరాత్ వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాల్లో ముందడుగు వేసి అభివృద్ధి దిశ‌లో ప‌య‌నించింద‌న్నారు.

ప్ర‌జ‌లు ఇచ్చిన మ‌ద్ద‌తుతోనే..

2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. దేశంలో సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతుతో 2014లో విజయం సాధించామని అన్నారు. గత 11 సంవత్సరాల్లో 25 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు. మహిళలు, యువత, రైతుల సాధికారతకు అనేక పథకాలు అమలు చేశామని వివ‌రించారు. దేశానికి సేవ చేయడం గొప్ప గౌరవమని పేర్కొంటూ, “వికసిత భారత్” నిర్మాణానికి కట్టుబడి ఉన్నానని మోదీ పునరుద్ఘాటించారు.

Read Aslo :

New CDS | సీడీఎస్‌ సహా ఆర్మీ, నేవీలకు కొత్త బాస్‌లు..!

Iran-US Conflict | ఇరాన్‌ దాడులతో అమెరికా సైనిక స్థావరాలకు భారీ నష్టం

Advertisement

తాజావార్తలు

Advertisement