Iran-US Conflict | ఇరాన్ దాడులతో అమెరికా సైనిక స్థావరాలకు భారీ నష్టం
Iran-US Conflict | పశ్చిమ ఆసియాలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే యుద్ధానికి సంబంధించిన నివేదిక సంచలన విషయాలను బయపెట్టింది. యుద్ధం ప్రారంభమైన తొలి రెండువారాల్లోనే ఇరాన్ దాడులతో అమెరికా వినియోగిస్తున్న సైనిక స్థావరాలకు దాదాపు 800 మిలియన్ డాలర్లు నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
International | Published On Mar 22, 2026, 10.10 am IST
- రాడార్, శాటిలైట్ వ్యవస్థలపై ఇరాన్ లక్షిత దాడులు
- రెండువారాల్లోనే 800 బిలియన్ డాలర్లు నష్టం
- బీబీసీ-సీఎస్‌ఐఎస్ సంయుక్త నివేదికలో సంచలన విషయాలు
Iran-US Conflict | పశ్చిమ ఆసియాలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే యుద్ధానికి సంబంధించిన నివేదిక సంచలన విషయాలను బయపెట్టింది. యుద్ధం ప్రారంభమైన తొలి రెండువారాల్లోనే ఇరాన్ దాడులతో అమెరికా వినియోగిస్తున్న సైనిక స్థావరాలకు దాదాపు 800 మిలియన్ డాలర్లు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. బీబీసీ, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) సంయుక్తంగా చేసిన విశ్లేషణ ప్రకారం.. ఈ నష్టం ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉంటోంది. అలాగే, యుద్ధ వ్యయం అమెరికాకు క్రమంగా పెరుగుతున్నట్లు సూచిస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి వారం రోజుల్లో ఇరాన్ ప్రతీకార దాడుల్లోనే ఎక్కువ నష్టం సంభవించినట్లు నివేదిక చెబుతోంది. ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలకు జరిగిన నష్టం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎస్‌ఐఎస్ సీనియర్ సలహాదారు మార్క్ కాన్షియన్ తెలిపారు.
మౌలిక సదుపాయాలే లక్ష్యం..
ఇరాన్ జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లోని కీలక సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. వీటిలో వైమానిక రక్షణ వ్యవస్థలు, ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. జోర్డాన్‌లోని అమెరికా థాడ్ (THAAD) క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఎన్-టీపీవై-2 (AN/TPY-2) రాడార్‌పై దాడితో సుమారు 485 మిలియన్ డాలర్ల నష్టం సంభవించినట్లు అంచనా. దీనికి తోడు ఇతర స్థావరాల్లో భవనాలు, సదుపాయాలు, మౌలిక సదుపాయాలకు సుమారు 310 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. శాటిలైట్ చిత్రాల ప్రకారం.. ఇరాన్ కనీసం మూడు వైమానిక స్థావరాలపై పలు మార్లు దాడులు చేసింది. కువైట్‌లోని అలీ అల్-సలీం, ఖతార్‌లోని అల్-ఉదైద్, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లు ప్రభావితమయ్యాయి. అదేవిధంగా, కువైట్‌లోని క్యాంప్ అరిఫ్జాన్, బహ్రెయిన్‌లోని సదుపాయాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాడార్ వ్యవస్థలకు రక్షణగా ఉండే నిర్మాణాలు ధ్వంసం కావడం వల్ల లోపలి పరికరాలకు కూడా నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
రాడార్ వ్యవస్థలే టార్గెట్‌గా..
ఆధునిక యుద్ధాల్లో ‘కళ్లూ చెవులుగా’ భావించే రాడార్, ఉపగ్రహ వ్యవస్థలను ఇరాన్ తొలి నుంచే లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదిక పేర్కొంటోంది. దీంతో అమెరికా దక్షిణ కొరియా నుంచి కొన్ని థాడ్ భాగాలను పశ్చిమ ఆసియాకు తరలించాల్సి వచ్చింది. ఈ 800 మిలియన్ నష్టం మొత్తం యుద్ధ ఖర్చులో చిన్న భాగమే. సీఎస్‌ఐఎస్ ప్రకారం.. యుద్ధం ఆరు రోజుల్లోనే అమెరికాకు 11.3 బిలియన్ డాలర్లు ఖర్చు కాగా.. 12 రోజులకు అదికాస్త 16.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక అదనంగా 200 బిలియన్లు నిధులు అవసరమని పెంటగాన్ కోరుతోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ‘శత్రువులను ఎదుర్కోవాలంటే ఖర్చు తప్పదు’ అని వ్యాఖ్యనించడం విశేషం.
భారీగా పెరిగిన మరణాలు..
ట్రంప్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 28న ప్రారంభమైన దాడుల తర్వాత ఇప్పటి వరకు 13 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం.. మొత్తం మరణాల సంఖ్య దాదాపు 3,200కి చేరుకుంది. ఇందులో సుమారు 1,400 మంది పౌరులు ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వం అమెరికాకు తలొగ్గడం లేదు. దాంతో అమెరికా మరికొద్దిరోజులు యుద్ధం చేయాలని భావిస్తోంది. పలుసార్లు ఆయుధాలు వీడాలని ట్రంప్ ఇరాన్‌ను ఆదేశించి.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాతో పాటు ఆ దేశానికి సహకరించే దేశాలపై ప్రతి దాడులో చేస్తూ వస్తోంది. అయితే, ఇరాన్‌కు సైనికులను పంపే ఆలోచనలో ఉందని తెలుస్తుండగా.. ప్రస్తుతం ఈ విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. అయితే, ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతోంది. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






