త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New CDS | సీడీఎస్‌ సహా ఆర్మీ, నేవీలకు కొత్త బాస్‌లు..!

New CDS | భారత సైనిక వ్యవస్థలో రాబోయే మూడు నెలల్లో గణనీయమైన మార్పులు జరుగనున్నాయి. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ నియామకంతో మార్పులు ప్రారంభమవుతాయి. ప్రస్తుత సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ మే 30న తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. కొత్త సీడీఎస్‌ ఎన్నికపై ఏప్రిల్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

P

National | Published On Mar 22, 2026, 11.15 am IST

New CDS | సీడీఎస్‌ సహా ఆర్మీ, నేవీలకు కొత్త బాస్‌లు..!
Advertisement

New CDS | భారత సైనిక వ్యవస్థలో రాబోయే మూడు నెలల్లో గణనీయమైన మార్పులు జరుగనున్నాయి. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ నియామకంతో మార్పులు ప్రారంభమవుతాయి. ప్రస్తుత సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ మే 30న తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. కొత్త సీడీఎస్‌ ఎన్నికపై ఏప్రిల్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. సీడీఎస్‌తో పాటు ఆర్మీ చీఫ్‌, నేవీ చీఫ్‌, డీఆర్డీవోకు కొత్త చైర్మన్‌ను సైతం నియమించే అవకాశాలున్నాయి.

ప్రస్తుత సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ రెండో సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాలుగేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. మే నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగినున్నది. ఆయన జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. దాంతో రెండో సీడీఎస్‌గా 2022 సెప్టెంబర్ 30న బాధ్యతలు స్వీకరించారు. ఆయన చైనా వ్యవహారాల నిపుణుడిగా గుర్తింపు పొందారు. సైనిక అధికారిగా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఇదిలా ఉండగా.. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కుమార్‌ త్రిపాటి మే నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన 15 మే 1964లో జన్మించారు. ఆయన వయసు 62 సంవత్సరాలకు చేరింది. దాంతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అలాగే, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది జూన్‌ 30 నాటికి 62 ఏళ్లకు చేరుకోనున్నారు.

ఇక డీఆర్డీవో చీఫ్‌ డాక్టర్‌ సమీర్‌ కామత్‌ మే 31న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్, రక్షణ కార్యదర్శి రాజేశ్‌ కుమార్ సింగ్ పదవీకాలం అక్టోబర్‌ వరకు ఉంది. కొత్త సీడీఎస్‌ ఎంపిక ప్రక్రియలో పలు ఖచ్చితమైన అర్హతులున్నాయి. రక్షణశాఖ రూల్స్‌ ప్రకారం.. త్రివిధ దళాల్లో పని చేస్తున్న లేదంటే పదవీ విరమణ చేసిన త్రీ స్టార్‌, ఫోర్‌ స్టార్‌ స్థాయి అధికారులు అర్హులు. గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు కాగా.. నియామకం సమయంలో రిటైర్డ్‌ అధికారులు 62 ఏళ్ల వయసు దాటకూడదు. కొత్త సీడీఎస్‌ను నియమించేందుకు అందుబాటులో 150 మందికిపైగా అధికారులు ఉన్నారు. కేబినెట్‌ రిక్రూట్‌మెంట్‌ కమిటీ ఏప్రిల్‌ చివరలో కొత్త సీడీఎస్‌ పేరును అధికారికంగా ప్రకటించనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement