PM Modi | మహిళలతో కలిసి టీ ఆకు తెంపిన ప్రధాని మోదీ
PM Modi | దిబ్రూగఢ్ (Dibrugarh)లో టీ గార్డెన్‌ను (tea garden) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న మహిళలతో ముచ్చటించారు. వారితో కలిసి టీ ఆకును తెంపారు.
PM Modi | అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. ఇవాళ పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం దిబ్రూగఢ్ (Dibrugarh)లో టీ గార్డెన్‌ను (tea garden) మోదీ సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న మహిళలతో ముచ్చటించారు. వారితో కలిసి టీ ఆకును తెంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని స్వయంగా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇక్కడి టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు.
కాగా, 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దీమాజి జిల్లాలోని గోగాముఖ్, బిశ్వనాథ్ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక ఈ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే మ్యానిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. మొత్తం 31 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma), ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)తో పాటు మహిళలకు నెలకు రూ.3వేలు, రెండు లక్షల ఉద్యోగాలు వంటి హామీలు ప్రకటించారు.





Also Read..
చరిత్రలో తొలిసారి డబుల్ అయిన జెట్ ఫ్యూయల్ ధర.. భారీగా పెరగనున్న విమాన ఛార్జీలు!
ఇంకో రెండు వారాలే.. ధరలు అవే తగ్గుతాయ్.. యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన
తెల్లవారగానే పిడుగులాంటి వార్త.. 30 వేల మందిపై ఒరాకిల్ వేటు.. భారత్‌లో 12 వేల మందికి ఉద్వాసన
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






