Donald Trump | ఇంకో రెండు వారాలే.. ధరలు అవే తగ్గుతాయ్.. యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన
Donald Trump | ఇరాన్‌తో యుద్ధం (Iran War) ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. మరో రెండు నుంచి మూడు వారాల్లో (Maybe Two Weeks) ఇరాన్‌పై సైనిక చర్యలను ముగించే అవకాశం ఉందని చెప్పారు.
International | Published On Apr 1, 2026, 11.17 am IST
Donald Trump | ఇరాన్‌తో యుద్ధం (Iran War) ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. మరో రెండు నుంచి మూడు వారాల్లో (Maybe Two Weeks) ఇరాన్‌పై సైనిక చర్యలను ముగించే అవకాశం ఉందని చెప్పారు. ఈ యుద్ధం ముగింపుకు ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
మంగళవారం వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పెరిగిన ఇంధన ధరల ప్రభావం గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా... "మేం ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలగుతాం. బహుశా రెండు, మూడు వారాలు పట్టొచ్చు. ఆ పని మేం త్వరలోనే చేయబోతున్నాం. రెండు రోజులు అటు ఇటులో పనిపూర్తి చేస్తాం. అప్పుడు ఇంధన ధరలు అవే పడిపోతాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఒప్పందం అవసరం లేదు..
అంతేకాదు, సైనిక చర్యను ముగించేందుకు ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం అవసరం లేదని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. "వారు ఇక అణ్వాయుధాన్ని తయారు చేయలేరని మాకు అనిపించినప్పుడు.. మేము అక్కడి నుంచి వైదొలుగుతాము. మాకు ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అది అప్రస్తుతం," అని ట్రంప్ పేర్కొన్నారు.
కోలుకునేందుకు 20 ఏళ్లు పడుతుంది..
తమ దాడుల్లో ఇరాన్ సైనిక సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్‌తో కలిసి తాము జరిపిన దాడుల నుంచి కోలుకునేందుకు ఇరాన్‌కు 20 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. ఇక ఈ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అధ్యక్షుడు ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ ప్రసంగంలో ఇరాన్‌కు సంబంధించిన ఓ ముఖ్యమైన ప్రకటన ఉంటుందని వెల్లడించింది.
Also Read..
తెల్లవారగానే పిడుగులాంటి వార్త.. 30 వేల మందిపై ఒరాకిల్ వేటు.. భారత్‌లో 12 వేల మందికి ఉద్వాసన
యుద్ధం ముగియబోతుందని సంకేతాలు.. భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు..
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






