త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DA Hike | ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. డీఏ 2 శాతం పెంపు

DA Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు (central government employees), పెన్ష‌న‌ర్ల‌కు (pensioners) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్‌నెస్‌ అలవెన్స్‌ (కరవు భత్యం) 2 శాతం పెంచింది.

D

National | Published On Apr 18, 2026, 2.47 pm IST

DA Hike | ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. డీఏ 2 శాతం పెంపు
Advertisement

DA Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు (central government employees), పెన్ష‌న‌ర్ల‌కు (pensioners) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్‌నెస్‌ అలవెన్స్‌ (కరవు భత్యం) 2 శాతం పెంచింది. డీఏ పెంపు (DA Hike) ప్రతిపాదనలకు ప్ర‌ధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చివరిగా గతేడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం డీఏను 55 శాతం నుంచి 58 శాతానికి పెంచిన విష‌యం తెలిసిందే. ఆ పెంపును 2025 జూలై 1 నుంచి అమలు చేసింది. ఇక తాజా నిర్ణయంతో డియర్‌నెస్‌ అలవెన్స్‌ రేటు 58 నుంచి 60 శాతానికి పెరగ‌నుంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత దీనిపై మ‌రింత స్పష్టత రానుంది. కేంద్రం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు కోటిమందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నది.

కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (dearness allowance) పెంచుతుంది. ఇది జనవరి, జూలైల్లో జరగాల్సి ఉన్నప్పటికీ ఏటా మార్చి, అక్టోబరులో ప్రకటిస్తూ వస్తోంది. ఆలస్యంగా ప్రకటించినా.. బకాయిలతో కలిపి జనవరి, జూలై నుంచే చెల్లిస్తారు. ముఖ్యంగా డీఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్‌ను (AICPIN-IW) ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఇదే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది. అయితే ఈసారి సగం ఏప్రిల్​ అయిపోయినా కూడా డీఏ పెంపుపై ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన కనిపించింది. చివరికి శనివారం డీఏ పెంపుపై కేబినెట్​ నిర్ణయం తీసుకుంది.

Also Read..

విపక్షాలు క్ష‌మించ‌రాని తప్పు చేశాయి.. శిక్ష‌ తప్పదు : మహిళా కోటా బిల్లుపై ప్రధాని మోదీ

మోదీ ప్ర‌భుత్వానికి చీక‌టి రోజు.. ఈ ఫ‌లితం విప‌క్షాల ఐక్య‌త‌కు నిద‌ర్శ‌నం.. రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోవ‌డంపై ప్రియాంక గాంధీ

మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు.. పాత చ‌ట్టాన్నే అమ‌లు చేయాలంటూ ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌

Advertisement
Advertisement