త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YouTube Shorts | యూట్యూబ్ షార్ట్స్ కు కొత్త అప్‌డేట్‌.. వీడియోల‌ను అస‌లు చూడ‌కుండా ఆపొచ్చు..

YouTube Shorts | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో షార్ట్స్ టైమ్ మేనేజ్‌మెంట్ ఫీచ‌ర్‌ను మ‌రింత విస్త‌రించింది. యూజ‌ర్లు త‌మ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు గాను కొత్త అప్‌డేట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో భాగంగా యూజ‌ర్లు షార్ట్స్ వినియోగ స‌మ‌యాన్ని సున్నా నిమిషాల‌కు (జీరో మిన‌ట్స్‌) సెట్ చేసుకునే ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది.

S

Technology | Published On Apr 18, 2026, 1.28 pm IST

YouTube Shorts | యూట్యూబ్ షార్ట్స్ కు కొత్త అప్‌డేట్‌.. వీడియోల‌ను అస‌లు చూడ‌కుండా ఆపొచ్చు..
Advertisement

YouTube Shorts | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో షార్ట్స్ టైమ్ మేనేజ్‌మెంట్ ఫీచ‌ర్‌ను మ‌రింత విస్త‌రించింది. యూజ‌ర్లు త‌మ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు గాను కొత్త అప్‌డేట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో భాగంగా యూజ‌ర్లు షార్ట్స్ వినియోగ స‌మ‌యాన్ని సున్నా నిమిషాల‌కు (జీరో మిన‌ట్స్‌) సెట్ చేసుకునే ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని వ‌ల్ల యూజ‌ర్లు షార్ట్స్ ను ఎంత సేపు, ఎంత త‌ర‌చూ వీక్షించాలో పూర్తిగా నియంత్ర‌ణ చేయ‌గ‌లుగుతారు. అన‌వ‌స‌రంగా ఎక్కువ స‌మ‌యం పాటు షార్ట్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తూ స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది.

కొత్త‌గా సున్నా నిమిషాల‌కు లిమిట్‌..

యూట్యూబ్‌లో ఈ ఫీచ‌ర్‌ను ఇది వ‌ర‌కే ప్ర‌వేశ‌పెట్టారు. గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే ఈ ఫీచ‌ర్ తొలుత అందుబాటులోకి వ‌చ్చింది. అయితే స‌మ‌యాన్ని 15 నిమిషాల నుంచి 2 గంట‌ల వ‌ర‌కు సెట్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. అంటే రోజూ ఎన్ని నిమిషాల పాటు షార్ట్స్ చూడాలో స‌మ‌యాన్ని నిర్దేశించుకోవ‌చ్చ‌న్న‌మాట‌. అయితే ఈ లిమిట్‌ను ఇప్పుడు సున్నా నిమిషాల‌కు మార్చారు. అంటే యూజ‌ర్లు అస‌లు రోజూ షార్ట్స్ అసలు చూడ‌కుండా పూర్తిగా నిలిపివేయ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలో యూట్యూబ్‌లో షార్ట్స్ సెక్ష‌న్‌ను ఓపెన్ చేస్తే యూజ‌ర్ల‌కు ఒక నోటిఫికేష‌న్ ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ రోజుకు షార్ట్స్ వీక్ష‌ణ కోటా పూర్త‌యింద‌ని చూపిస్తుంది. దీంతో యూజ‌ర్ టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఏవైనా ప‌నులు ఉంటే పూర్తి చేసుకుంటారు. ఇలా షార్ట్స్ లో ఉన్న ఈ ఫీచ‌ర్ సోష‌ల్ మీడియా వ్య‌స‌నాన్ని త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇలా సెట్ చేసుకోవ‌చ్చు..

అయితే షార్ట్స్ సెక్ష‌న్‌లో వీక్ష‌ణ కోటా ముగిసింద‌న్న మెసేజ్ వ‌స్తే కింద మ‌ళ్లీ రెండు ఆప్ష‌న్‌ల‌ను ఇచ్చారు. కోటాను ప‌ట్టించుకోకుండా ముందుకు సాగ‌డం లేదా అక్క‌డికి షార్ట్స్ వీక్ష‌ణ ఆపేసి యాప్‌ను క్లోజ్ చేయ‌డం వంటి రెండు ఆప్ష‌న్‌లు ఉంటాయి. వాటిల్లో యూజ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. ఇక షార్ట్స్‌ను రోజూ ఎన్ని నిమిషాల పాటు చూడాల‌నే లిమిట్‌ను యూజ‌ర్లు సెట్ చేసుకునేందుకు ప‌లు స్టెప్స్ ను ఫాలో కావ‌ల్సి ఉంటుంది. ముందుగా యూట్యూబ్‌ను ఓపెన్ చేసి సైనిన్ అవ్వాలి. త‌రువాత యూ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అందులో ఉండే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్క‌డ ఉండే టైమ్ మేనేజ్‌మెంట్ డాష్ బోర్డ్‌ను ఓపెన్ చేయాలి. అనంత‌రం షార్ట్స్ ఫీడ్ లిమిట్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అక్క‌డ వివిధ స‌మ‌యాల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చ‌ని సూచిస్తుంది. అలాగే జీరో మిన‌ట్స్ అనే కొత్త ఆప్ష‌న్ కూడా ద‌ర్శ‌న‌మిస్తుంది. అందులో యూజ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన లిమిట్‌ను సెట్ చేసుకుని స‌బ్‌మిట్ పై క్లిక్ చేయాలి. దీంతో షార్ట్స్ వీక్ష‌ణ‌కు ఆ టైమ్ లిమిట్ సెట్ అవుతుంది.

హోమ్ ఫీడ్‌లో షార్ట్స్ రావు..

ఇక యూట్యూబ్‌లో షార్ట్స్‌ను రోజూ అస‌లు చూడొద్దు అనుకుని జీరో మిన‌ట్స్‌గా సెట్ చేస్తే షార్ట్స్ హోమ్ పేజ్ ఫీడ్‌లోనూ క‌నిపించ‌వు. కానీ సబ్‌స్క్రిప్షన్స్ ఫీడ్‌లో మాత్రం కొన్ని సార్లు క‌నిపిస్తాయి. ఇక యూజ‌ర్లు వ్య‌క్తిగ‌తంగా షార్ట్స్‌ను మాన్యువ‌ల్ గా యాక్సెస్ చేసే వీలు క‌ల్పించారు. కానీ ఫీడ్ రూపంలో చూడలేరు. షార్ట్స్ ఒక వీడియోను చూశాక కింద‌కు స్క్రోల్ చేస్తే ఫీడ్ అక్క‌డికే ఆగిపోతుంది. త‌రువాత షార్ట్స్ వీక్ష‌ణ టైమ్ లిమిట్ పూర్త‌యింద‌ని మెసేజ్ చూపిస్తుంది. ఇలా ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది. ఇక ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో పేరెంట‌ల్ కంట్రోల్స్‌లో భాగంగా అందిస్తుండ‌గా, దీన్ని ద‌శ‌ల‌వారీగా యూజ‌ర్లంద‌రికీ ప్ర‌త్యేక సెక్ష‌న్ ద్వారా అందించ‌నున్నారు.

Advertisement
Advertisement