త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | స్వావ‌లంబ‌నకు బ‌లాన్ని జోడించిన స‌ముద్ర ప్ర‌తాప్‌: ప్ర‌ధాని మోదీ

స‌ముద్ర జ‌లాల‌ను కాలుష్యం బారి నుంచి కాపాడే అత్యాధునిక తీర‌గ‌స్తీద‌ళ నౌక ఐసీజీ స‌ముద్ర ప్ర‌తాప్‌ను (Samudra Pratap) ప్రారంభించ‌డం మ‌న‌ స్వావలంబన దృక్పథానికి మ‌రింత బలం జోడించిన‌ట్ల‌యింద‌ని ప్ర‌ధాని మోదీ (PM Modi) అన్నారు.

G

National | Published On Jan 7, 2026, 11.51 am IST

PM Modi | స్వావ‌లంబ‌నకు బ‌లాన్ని జోడించిన స‌ముద్ర ప్ర‌తాప్‌: ప్ర‌ధాని మోదీ
Advertisement

న్యూఢిల్లీ: స‌ముద్ర జ‌లాల‌ను కాలుష్యం బారి నుంచి కాపాడే అత్యాధునిక తీర‌గ‌స్తీద‌ళ నౌక ఐసీజీ స‌ముద్ర ప్ర‌తాప్‌ను (Samudra Pratap) ప్రారంభించ‌డం మ‌న‌ స్వావలంబన దృక్పథానికి మ‌రింత బలం జోడించిన‌ట్ల‌యింద‌ని ప్ర‌ధాని మోదీ (PM Modi) అన్నారు. అది మ‌న నిబద్ధతను ప్రతిబింబించ‌డంతోపాటు, స‌ముద్ర గ‌స్తీలో భద్రత‌ను బ‌లోపేతం చేసిన‌ట్ల‌యింద‌ని తెలిపారు.

సముద్రంలో కాలుష్య నియంత్ర‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డేలా రూ.2500 కోట్ల‌తో స్వదేశీ పరిజ్ఞానంతో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ సముద్ర ప్ర‌తాప్ నౌక‌ను నిర్మించింది. దీనిని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గ‌త సోమ‌వారం గోవా షిప్‌యార్డ్‌లో జ‌ల‌ప్ర‌వేశం చేయించారు. చ‌మురు వ్య‌ర్థాల‌ను నిర్మూలించి జ‌ల‌చ‌రాల‌ను కాపాడేందుకు దోహ‌ద‌ప‌డే ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం ఇందులో ఉంది.

ఎన్నో ప్రత్యేకతలు..

  • ఈ నౌకలోని మొత్తం 60 శాతం విడిభాగాలు, ఉపకరణాలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశారు.
  • దీని పొడ‌వు 114.5 మీటర్లు, 4,200 టన్నుల బ‌రువున్న ఈ గ‌స్తీ నౌక గంటకు 22 నాటిక్‌ మైళ్లకంటే అధిక వేగంతో దూసుకెళ్తుంది.
  • పూర్తి ఇంధన సామర్థ్యంతో ఏకంగా 6 వేల‌ నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణిస్తుంది.
  • వాణిజ్యనౌకలు, సరకు రవాణా నౌకల నుంచి ఒలికిపోయే, ప్రమాదాల కారణంగా సముద్రజలాల ఉపరితలంపై చేరిన ముడిచమురు, తెట్టును ఇది తొలగిస్తుంది.
  • వ్యర్థాలను ఒక దగ్గరకు లాక్కొచ్చే సైడ్‌ స్వీపింగ్‌ చేతులు, ఫ్లోటింగ్‌ బూమ్‌లు, అత్యధిక సామర్థ్యముండే స్కిమ్మర్లు, పోర్టబుల్‌ బార్జ్‌లు ఇలా అన్ని రకాల పరికరాలతో ఈ నౌకలో ఉన్నాయి
  • చమురునౌకలకు అగ్నిప్ర‌మాదం సంభవిస్తే మంట‌ల‌ను ఆర్పే ఎఫ్‌ఐ–ఎఫ్‌ఐ క్లాస్‌–1 తరగతి స్థాయి శక్తివంతమైన అగ్నిమాపక వ్యవస్థ ఇందులో ఉంది.
  • కొచ్చి స్థావరంగా పనిచేసే ఈ నౌకలో 14 మంది అధికారులు, 115 మంది సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారు. వీళ్లలో ఇద్దరు మహిళాధికారులు సైతం విధులు నిర్వర్తించనున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement