త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Junga Palace | అగ్నికి ఆహుతైన 200 ఏండ్ల‌ నాటి ప్యాలెస్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిమ్లా ఉన్న 200 ఏండ్ల నాటి అంద‌మైన ప్యాలెస్ (Junga Palace) అగ్నికి ఆహుతైంది. షిమ్లా (Shimla) న‌గ‌రానికి 26 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జుంగా ప్రాంతంలో కియోంథ‌ల్ సంస్థానాధీశులు ( Keonthal royal family) చెక్క‌ల‌తో జుంగా మ‌హ‌ల్ ప్యాలెస్‌ను నిర్మించారు.

G

National | Published On Jan 8, 2026, 9.51 am IST

Junga Palace | అగ్నికి ఆహుతైన 200 ఏండ్ల‌ నాటి ప్యాలెస్‌
Advertisement

trinethra.new: హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిమ్లా ఉన్న 200 ఏండ్ల నాటి అంద‌మైన ప్యాలెస్ (Junga Palace) అగ్నికి ఆహుతైంది. షిమ్లా (Shimla) న‌గ‌రానికి 26 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జుంగా ప్రాంతంలో కియోంథ‌ల్ సంస్థానాధీశులు ( Keonthal royal family) చెక్క‌ల‌తో జుంగా మ‌హ‌ల్ ప్యాలెస్‌ను నిర్మించారు. అయితే బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటిగంట స‌మ‌యంలో ఈ ప్యాలెస్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అగ్ని కీల‌లు ప్యాలెస్ మొత్తానికి వ్యాపించాయి. ప్యాలెస్ పై అంత‌స్థు నుంచి పొగ‌లు వ‌స్తుండటాన్ని గ‌మ‌నించిన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. చోటా షిమ్లా నుంచి వ‌చ్చిన‌ ఫైర్ ఇంజిన్లు మంట‌ల‌ను అదుపు చేశాయి.

అయితే అప్ప‌టికే మహల్‌లోని చారిత్రక పత్రాలు, పురాతన ఫర్నీచర్, అత్యంత రమణీయమైన కళాఖండాలు, చిత్రాలు, అబ్బురపరిచే నిర్మాణ కౌశలంతో ఉట్టిపడే భవనంలోని దర్వాజాలు, కిటికీలు, షాండ్లియర్లు అన్నీ కాలి బూడిద‌య్యాయి. హిమాచల్‌ ప్రదేశ వారసత్వ సందపగా ఈ మహల్‌కు ఎంతో పేరుంది. ఏటా పెద్ద సంఖ్య‌లో దేశీయ‌, విదేశీ ప‌ర్యాట‌కులు ఈ మహల్‌ను సందర్శిస్తూ ఉంటారు. కాగా, అగ్ని ప్రమాదం వ‌ల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement