త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

2K Notes | మీ వద్ద ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా..? మార్చుకునే అవకాశం ఉందా..? ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే..?

2K Notes | భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2వేల నోట్లను 2023 మే 19న ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించింది. పెద్ద మొత్తంలో రూ.2వేల నోట్లు రిజర్వ్‌ బ్యాంక్‌కు చేరాయి.

P

Business | Published On Jan 8, 2026, 10.00 am IST

2K Notes | మీ వద్ద ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా..? మార్చుకునే అవకాశం ఉందా..? ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే..?
Advertisement

2K Notes | భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2వేల నోట్లను 2023 మే 19న ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించింది. పెద్ద మొత్తంలో రూ.2వేల నోట్లు రిజర్వ్‌ బ్యాంక్‌కు చేరాయి. అయితే, ఇంకా రూ.5వేలకోట్లకుపైగా విలువైన నోట్లు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. ఆర్‌బీఐ నోట్లను చలామణిలో నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.

2025 డిసెంబర్‌ 31 నాటికి 98.41శాతం నోట్లు వెనక్కి వచ్చాయని కేంద్ర బ్యాంకు తెలిపింది. ఇంకా రూ.5,669 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది. గడిచిన రెండు నెలల్లోనూ స్వల్ప మొత్తంలో రూ.2వేల నోట్లు తిరిగి డిపాజిట్‌ అయ్యాయి. అక్టోబర్‌ 31 వరకు చలామణిలో రూ.5,817 కోట్లు ఉండగా.. జనవరి నెలాఖరు నాటికి రూ.5,665 కోట్లకు తగ్గింది. అంటే రెండు నెలల కాలంలో రూ.148కోట్ల విలువైన నోట్లు ఆర్‌బీఐకి అందాయి. అయితే, నోట్లను ఉపసంహరించుకున్నా.. నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని సెంట్రల్‌ బ్యాంక్‌ ఇటీవల పేర్కొంది.

ఇంకా ఎవరి వద్దనైనా రూ.2వేల నోట్లు ఉంటే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికీ నోట్లను మార్చుకునే అవకాశం ఉందని చెప్పింది. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు అవకాశం 2023 అక్టోబర్‌లోనే ముగియగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, గౌహతి, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం సహా 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని.. అలాగే పోస్టాఫీస్‌ ద్వారా డిపాజిట్‌ చేసుకోవచ్చని చెప్పింది. నోట్లను పోస్టల్‌ ద్వారా పంపిస్తే ఆయా వ్యక్తుల ఖాతాల్లో డబ్బును జమ చేయనున్నట్లుగా వివరించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement