రోజుకు 5వేల కోసం.. కూతురుతో ఆ పని చేయిస్తున్న కన్న తండ్రి
కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) దారుణం చోటుచేసుకున్నది. రోజుకు రూ.5 వేల కోసం కక్కుర్తిపడిన ఓ తండ్రి కన్న కూతురితో చెప్పుకోరాని (Prostitution) పనిచేయిస్తున్నాడు.
trinethra.new: కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) దారుణం చోటుచేసుకున్నది. రోజుకు రూ.5 వేల కోసం కక్కుర్తిపడిన ఓ తండ్రి కన్న కూతురితో చెప్పుకోరాని (Prostitution) పనిచేయిస్తున్నాడు. తండ్రికి నానమ్మ కూడా తోడవడంతో ఆ యువతి పలువురి వాంఛకు బలైపోయింది. వారి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
చిక్కమంగళూరు జిల్లా అజ్జంపూర్‌కు చెందిన గిరీశ్‌కు 17 ఏండ్ల కూతురు ఉన్నది. ఆరేండ్ల క్రితం ఆమె తల్లి మరణించింది. దీంతో నానమ్మ నాగరత్న, తండ్రితో కలిసి ఉంటున్నది. ఈ క్రమంలో ఆ యువతితో పడుపు వృత్తి చేయిస్తే రోజుకు రూ.5 వేలు ఇస్తామని పలువురు గిరీశ్‌కు ఆశచూపారు. దీంతో తన తల్లితో కలిసి ఆ మైనర్ బాలికను ఆమె తండ్రి పడుపు వృత్తిలోకి దించాడు. అంతకు ముందే మంగళూరుకు చెందిన భరత్ శెట్టి అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

తనకు రుతుస్రావం అవుతుందన్నా వినకుండా ఆరు రోజులపాటు బలవంతంగా లైంగిక దాడి చేశారు. తండ్రి, నానమ్మ, తనతో పడుపు వృత్తి చేయిస్తున్నవారి వేధింపులు బరించలేకపోయిన ఆమె.. ఎలాగోలా తప్పించుకుని బీరూరు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసి, బాధితురాలి తండ్రి, నానమ్మ సహా పది మందిని అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని బాలసదన్‌కు పంపించామని జిల్లా ఎస్పీ జితేందర్ కుమార్ దయామ తెలిపారు.
సంబంధిత వార్తలు

Pocso Case | పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు..
మే 15, 2026

Pocso Case | రప్పిస్తారా? తప్పిస్తారా?.. పోక్సో కేసులో రోజురోజుకూ పెరుగుతున్న ఉత్కంఠ
మే 13, 2026

KTR | అన్ని విషయాల్లో ఏకరూపత కోరుకునే బీజేపీ.. బంధువుల విషయంలో మాత్రం రెండు ప్రమాణాలు: కేటీఆర్
మే 13, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



