త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fact Check | గోల్డ్, మొబైల్, స్కూటీ, కార్లు ఉచితంగా ఇచ్చే స్కీమ్‌ని ప్రధాని మోదీ తీసుకొచ్చారా?

ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి ప్రకటనేమీ చేయలేదని, అలాంటి తప్పుడు సమాచారం చూసి ప్రభావితులు కావొద్దని.. నిజానిజాలు తెలుసుకోకుండా అలాంటివి చూసి నమ్మొద్దని, ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

J

National | Published On Jan 4, 2026, 6.06 pm IST

Fact Check | గోల్డ్, మొబైల్, స్కూటీ, కార్లు ఉచితంగా ఇచ్చే స్కీమ్‌ని ప్రధాని మోదీ తీసుకొచ్చారా?
Advertisement

Fact Check | ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ ఫ్రీ స్కీమ్ తెగ వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా దేశ ప్రజలకు గోల్డ్, మొబైల్, వాహనాలను ఉచితంగా అందజేసేలా ఒక స్కీమ్‌ను తీసుకొచ్చారని.. దానికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో బంగారం, ఫోన్లు, స్కూటీ, కారు ఉచితంగా అందిస్తున్నారంటూ మోదీ ఫోటోలు, ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియోలను యాడ్ చేశారు.

ఆ వీడియో చూసి నెటిజన్లు కూడా నిజమే కావచ్చు.. అని అనుకుంటున్నారు. తమకు ఎప్పుడు ఇస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులను కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం కేంద్రం దృష్టికి రావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యురో ద్వారా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో నిజం కాదని.. అది ఏఐతో చేసిన ఫేక్ వీడియో అని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి ప్రకటనేమీ చేయలేదని, అలాంటి తప్పుడు సమాచారం చూసి ప్రభావితులు కావొద్దని.. నిజానిజాలు తెలుసుకోకుండా అలాంటివి చూసి నమ్మొద్దని, ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement