Will Trump Kidanp Our PM | ప్రధాని మోదీని కూడా కిడ్నాప్ చేయనున్న డొనాల్డ్ ట్రంప్?
వెనిజులా అధ్యక్షుడిని అంత సింపుల్‌గా బందీని చేసుకున్న ట్రంప్‌కి నరేంద్ర మోదీని కిడ్నాప్ చేయడం పెద్ద లెక్క కాదన్నట్లుగా ఆయన మాట్లాడటం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Will Trump Kidanp Our PM | ప్రస్తుతం యూఎస్, వెనిజులా మధ్య ప్రత్యక్ష యుద్ధమే నడుస్తోంది. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను తన సొంత దేశంలోనే యూఎస్ బలగాలు చుట్టుముట్టీ అర్ధరాత్రి తన బెడ్‌రూమ్ నుంచి ఆయన భార్యతో సహా అమెరికాకు బందీని చేసి తీసుకెళ్లిన ఘటన ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. యూఎస్‌లో ఉండి డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించగలిగాడు. వెనిజులా నుంచి యూఎస్‌కి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, ఇతరత్రా కారణాలు చూపి ఆ దేశ అధ్యక్షుడిని తన బందీగా చేసుకున్న డొనాల్డ్ ట్రంప్‌కి వేరే దేశాధినేతలను కూడా తన దారికి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం యూఎస్, భారత్ మధ్య కూడా టారిఫ్‌కి సంబంధించిన గొడవలు జరుగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీని కూడా కిడ్నాప్ చేయిస్తే ఏంటి మన దేశ పరిస్థితి? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వెనిజులా అధ్యక్షుడిని అంత సింపుల్‌గా బందీని చేసుకున్న ట్రంప్‌కి నరేంద్ర మోదీని కిడ్నాప్ చేయడం పెద్ద లెక్క కాదన్నట్లుగా ఆయన మాట్లాడటం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
రేపే మన దేశంలో అలాంటి పరిస్థితి వస్తే?
వెనిజులా ఘటన అనేది ఐక్యరాజ్యసమితి రూల్స్‌కి వ్యతిరేకంగా జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. ఇది ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టు. అలాంటి పరిస్థితి ఏ దేశానికి రాకూడదు. కానీ.. ఇంకో దేశంలో కూడా అలాంటి పరిస్థితి ఎప్పుడైనా జరగొచ్చు. రేపు భారత్‌లో కూడా జరగొచ్చు.. అంటూ చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వెనిజులాపై సరైన స్టాండ్ తీసుకోని భారత్
వెనిజులాపై జరిగిన దాడిపై భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. రష్యా, చైనా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తే.. భారత్ మాత్రం మధ్యస్థంగా వ్యవహరించింది. ప్రపంచంలో జరుగుతున్న ముఖ్య ఘటనలపై భారత్ స్పందించాలి కదా.. అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.
చౌహాన్‌పై నెటిజన్ల మండిపాటు
ప్రధాని మోదీపై పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా భగ్గుమంటోంది. ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. మన దేశాన్ని మనమే అవమానించుకుందామా? మన దేశానికి వెనిజులా లాంటి పరిస్థితి రావాలని కోరుకోవడం ఏంటి? నీ మతి భ్రమించిందా? చదువుకున్న మూర్ఖుడిలా ఉన్నావు, అణురంగంలో అగ్రగామిగా ఉన్న భారత్ మీద చేయి వేసే దమ్ము ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా పని చేసిన ఒక సీనియర్ నేత దేశం గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ చవాన్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






