త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayalaan Telugu Review | అయలాన్ రివ్యూ – ఆహా ఓటీటీలో తెలుగులో రిలీజైన శివ‌కార్తికేయ‌న్ మూవీ ఎలా ఉందంటే?

శివ‌కార్తికేయ‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన అయ‌లాన్ మూవీ తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏలియ‌న్ క‌థ‌తో రూపొందిన ఈ సినిమాకు ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు

N

Entertainment | Published On Jan 8, 2026, 9.42 am IST

Ayalaan Telugu Review | అయలాన్ రివ్యూ  –  ఆహా ఓటీటీలో తెలుగులో రిలీజైన శివ‌కార్తికేయ‌న్ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Ayalaan Telugu Review |  కోలీవుడ్ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ న‌టించిన త‌మిళ మూవీ అయ‌లాన్ అదే పేరుతో తెలుగులో ఆహా ఓటీటీలో రిలీజైంది. ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏలియ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?

ఏలియ‌న్ భూమిపైకి వ‌స్తే...

తామిజ్ (శివ‌కార్తికేయ‌న్‌) ఓ రైతు. జంతు ప్రేమికుడైన తామిజ్ సేంద్రియ ప‌ద్ద‌తుల్లో వ్య‌వ‌సాయం చేస్తుంటాడు. ప్ర‌తి ఏటా న‌ష్టాలే రావ‌డంతో ఊళ్లో వారంద‌రూ అత‌డిని చుల‌క‌న చేసి మాట్లాడుతుంటారు. త‌ల్లి కోరిక మేర‌కు జాబ్ చేయ‌డానికి సిటీకి వెళ‌తాడు తామిజ్‌. అయిలా అనే గ్ర‌హం నుంచి స్పార్క్ అనే శిల భూమిపై ప‌డుతుంది. శ‌క్తివంత‌మైన స్పార్క్‌తో భూమిలోని నోవా గ్యాస్‌ను వెలికితీసే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు అర్య‌న్ (శ‌ర‌ద్ ఖేల్క‌ర్‌). అత‌డు చేసిన ప్ర‌యోగం విక‌టించి అఫ్రికాలో చాలా మంది చ‌నిపోతారు. మ‌రోసారి హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న ఓ మైన్‌లో సీక్రెట్‌గా ఈ ప్ర‌యోగం చేస్తుంటాడు. అత‌డి ద‌గ్గ‌ర ఉన్న స్పార్క్ కోసం టాటూ అనే ఎలియ‌న్ భూమిపైకి వ‌స్తుంది. ఆ స్పార్క్‌ను అర్య‌న్ నుంచి కొట్టేసే క్ర‌మంలో ఏలియ‌న్ స్పేష్ షిప్ మాయ‌మైపోతుంది. దాంతో టాటూ భూమిపైనే చిక్కుకుంటుంది. ఆర్య‌న్ మ‌నుషుల బారి నుంచి టాటూను తామిజ్ కాపాడుతాడు. కొద్ది ప‌రిచ‌యంలోనే తామిజ్‌, టాటూ మ‌ధ్య‌ మంచి బాండింగ్ ఏర్ప‌డుతుంది. తామిజ్‌ను అడ్డం పెట్టుకొని ఏలియ‌న్‌ను ఆర్య‌న్ మ‌నుషులు ఎలా ప‌ట్టుకున్నారు? ఏలియ‌న్ శ‌క్తులు తామిజ్‌కు ఎలా వ‌చ్చాయి? ఆర్య‌న్ ప్ర‌యోగాన్ని టాటూ, తామిజ్ ఎలా అడ్డుకున్నారు? తామిజ్ ప్రేమించిన తార (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ఎవ‌రు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

హాలీవుడ్‌లో ఫేమ‌స్‌...

ఏలియ‌న్ల క‌థల‌తో హాలీవుడ్‌లో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఏలియ‌న్లు భూమిపైకి రావ‌డం, ఇక్క‌డ అవి ఎదుర్కొనే ప‌రిస్థితుల‌తో హాలీవుడ్ డైరెక్ట‌ర్లు చాలానే సినిమాలు చేశారు. హాలీవుడ్‌తో పోలిస్తే ఇండియ‌న్ స్క్రీన్‌పై ఏలియ‌న్ క‌థ‌ల‌తో సినిమాలు రావ‌డం అరుదే. అందులో ద‌క్షిణాదిలో అస‌లే రాలేదు. అయ‌లాన్‌తో ఫ‌స్ట్ టైమ్ ద‌క్షిణాదిలో ఈ జాన‌ర్‌ను ట‌చ్ చేశారు డైరెక్ట‌ర్ ర‌వికుమార్‌.
ఈ హాలీవుడ్ జాన‌ర్ క‌థ‌ను మ‌న‌వైన భావోద్వేగాల‌తో చెప్ప‌డం అంటే క‌త్తిమీద సామే. ఈ ప్ర‌య‌త్నంలో చాలా వ‌ర‌కు డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యారు. ఏలియ‌న్ పాయింట్‌కు హీరోయిజం, కామెడీ, ల‌వ్‌స్టోరీని జోడిస్తూ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ మూవీగా అయ‌లాన్‌ను తెర‌కెక్కించారు.
అర్య‌న్ ప్ర‌యోగం, శివ‌కార్తికేయ‌న్ జీవితం, మ‌రోవైపు టాటూ భూమిపైకి రావ‌డం అనే మూడు ఉప‌క‌థ‌ల‌ను ప్యార‌లాల్‌గా చూపిస్తూ ఈ సినిమా మొద‌ల‌వుతుంది. వీటిని లింక్ చేసే సీన్లు ఆక‌ట్టుకుంటాయి. తామిజ్ కు టాటూ ప‌రిచ‌య‌మ‌య్యే సీన్ల నుంచి చ‌క్క‌టి ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యింది. ఆర్య‌న్ ప్ర‌యోగాన్ని అడ్డుకోవ‌డ‌మే కాకుండా అత‌డి వ‌ద్ద బంధీగా ఉన్న టాటూను తామిజ్ ఎలా విడిపించాడ‌న్న‌ది సెకండాఫ్‌లో చూపించారు. సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో సెకండాఫ్‌లో తామిజ్ చేసే ఫైట్ సీక్వెన్స్ ఆక‌ట్టుకుంటాయి. ముఖ్యంగా రోబో యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, క్లైమాక్స్ సీక్వెన్స్ బాగున్నాయి.

మంచి ఛాయిస్‌...

తామిజ్ పాత్ర‌లో శివ‌కార్తికేయ‌న్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టారు. కామెడీ టైమింగ్‌తో న‌వ్వించారు. యాక్ష‌న్ సీన్ల‌లో ఆక‌ట్టుకున్నారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త‌లేదు. స్టైలిష్ విల‌న్‌గా శ‌ర‌ధ్ ఖేల్క‌ర్ క‌నిపించారు. నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో సీనియ‌ర్ హీరోయిన్ ఇషా కొప్పిక‌ర్ న‌ట‌న బాగుంది.
తెలుగు డ‌బ్బింగ్ బాగుంది. ఏలియ‌న్ పాత్ర‌కు సిద్ధార్థ్ వాయిస్ బాగా కుదిరింది. ఎక్క‌డ త‌మిళ డ‌బ్బింగ్ సినిమా చూస్తున్న ఫీల్ క‌ల‌గ‌లేదు.
ఈ వారం ఓటీటీలో డిఫ‌రెంట్ కంటెంట్‌తో కూడిన సినిమాల కోసం చూస్తున్న వారికి అయ‌లాన్ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement