త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | వ‌చ్చే ఏడాది హ‌రిద్వార్‌లో కుంభ‌మేళా.. దేవ‌భూమిని శుభ్రంగా ఉంచుదాం : ప్ర‌ధాని మోదీ

PM Modi | ఉత్తరాఖండ్ (Uttarakhand)ను ఏడాది పొడవునా పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పున‌రుద్ఘాటించారు.

D

National | Published On Apr 14, 2026, 4.19 pm IST

PM Modi | వ‌చ్చే ఏడాది హ‌రిద్వార్‌లో కుంభ‌మేళా.. దేవ‌భూమిని శుభ్రంగా ఉంచుదాం : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | ఉత్తరాఖండ్ (Uttarakhand)ను ఏడాది పొడవునా పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పున‌రుద్ఘాటించారు. శీతాకాల ప‌ర్యట‌న‌ల‌కు, డెస్టినేష‌న్ వెడ్డింగ్స్‌కు ఈ రాష్ట్రం ఆక‌ర్ష‌ణీయ‌మైన గ‌మ్య‌స్థానంగా నిలుస్తోంద‌ని చెప్పారు. అయితే, ప్లాస్టిక్ సీసాలు, చెత్త కుప్పలు దేవభూమి పవిత్రతను దెబ్బతీస్తున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేవ‌భూమిని ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక‌నామిక్ కారిడాన్‌ను (Delhi-Dehradun expressway) ప్ర‌ధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌ధాని ప్ర‌సంగించారు. "శీతాకాల పర్యాటకం, వింటర్ స్పోర్ట్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఉత్తరాఖండ్ ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశంగా ఎదుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. శీతాకాలంలో ప‌ర్యాట‌కుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. 2023లో నేను కైలాస్‌, ఓం ప‌ర్వ‌తాన్ని సంద‌ర్శించాను. నేను వెళ్లిన త‌ర్వాత అక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. గ‌తంలో చ‌లికాలంలో కేవ‌లం వంద‌ల సంఖ్య‌లో మాత్ర‌మే ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి వ‌చ్చేవారు. కానీ, 2025లో 40 వేల కంటే ఎక్కువ మంది వ‌చ్చారు" అని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు.

అదే స‌మ‌యంలో దేవ‌భూమి ప్రాంతాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. ప్లాస్టిక్ సీసాలు, చెత్త కుప్ప‌లు దేవ‌భూమి ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీస్తాయ‌న్నారు. వచ్చే ఏడాది హరిద్వార్‌ (Haridwar)లో కుంభమేళా (Kumbh Mela) నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ‌కు వీలుగా ఉత్త‌రాఖండ్‌ను శుభ్రంగా ఉంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. దేశ సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక విలువ‌ల‌ను ప్ర‌తిబింబించేలా ఈ వేడుక‌ల‌ను వైభ‌వంగా జ‌రుపుకుందామ‌ని ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని సూచించారు.

Also Read..

బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ రాజీనామా.. మ‌రికాసేప‌ట్లో కొత్త సీఎం ఎంపిక‌

మ్యూజిక్ కన్సర్ట్‌లో తీవ్ర విషాదం: డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి

రిజర్వేషన్లు పొందడం వారి హ‌క్కు.. ఇంకా వేచి చూడటం సబబు కాదు.. మ‌హిళ‌ల‌కు ప్ర‌ధాని లేఖ‌

Advertisement
Advertisement