Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా.. మరికాసేపట్లో కొత్త సీఎం ఎంపిక
Nitish Kumar | బీహార్ (Bihar) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజీనామా చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పాట్నాలోని లోక్‌భవన్‌కు చేరుకున్న నితీశ్.. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.
Nitish Kumar | బీహార్ (Bihar) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజీనామా చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పాట్నాలోని లోక్‌భవన్‌కు చేరుకున్న నితీశ్.. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఏప్రిల్ 10వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. పెద్దల సభకు ఎన్నికైన నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు కేబినెట్ చివరి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే ముందు మంత్రిమండలిని రద్దు చేయడం రాజ్యాంగపరమైన ఆనవాయితీ. ఇందులో భాగంగానే కేబినెట్ సమావేశంలో తన నిర్ణయాన్ని సహచర మంత్రులకు నితీశ్ తెలియజేశారు.
రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీశ్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేయడంతో.. బీహార్ తదుపరి సీఎం ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీయే కూటమి మరికాసేపట్లో నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేయనుంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సామ్రాట్ చౌదరితోపాటూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) పేరు కూడా వినిపిస్తోంది. అయితే, సామ్రాట్ చౌదరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్‌ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.
Also Read..
రిజర్వేషన్లు పొందడం వారి హక్కు.. ఇంకా వేచి చూడటం సబబు కాదు.. మహిళలకు ప్రధాని లేఖ
దక్షిణాది ప్రజల్లో సీఎం రేవంత్ విద్వేషం రగిలిస్తున్నాడు : బండి సంజయ్
సంబంధిత వార్తలు

Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
మే 19, 2026

Bihar Cabinet Expansion | బీహార్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ తనయుడు
మే 7, 2026

BJP Victory in Bengal | చేపల కూర, ఝాల్‌మురితో కమలనాథుల విజయోత్సవాలు
మే 4, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



