PM Modi | నా చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను : ప్రధాని మోదీ
PM Modi | తన చివరి శ్వాస వరకూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రతిజ్ఞ చేశారు. గుజరాత్ (Gujarat) పర్యటనలో ఉన్న మోదీ.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 24వ విడతలో సుమారు రూ.19వేల కోట్ల నిధులను అధికారికంగా విడుదల చేశారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : తన చివరి శ్వాస వరకూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రతిజ్ఞ చేశారు. ఇవాళ తన సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat)లో ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా బనస్కాంత (Banaskantha) జిల్లా భిల్డిలో రూ. 14,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
ఈ సందర్భంగా విపక్షాలపై (Opposition) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఆనందపడే కొంతమంది వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారంటూ పరోక్షంలో చురకలంటించారు. ఇరాన్ యుద్ధం తర్వాత దేశంలో ఎరువుల కొరత ఏర్పడుతుందని, ఎల్పీజీ (వంటగ్యాస్) లభించదని కొందరు అవాస్తవాలు, వదంతులు ప్రచారం చేశారని మండిపడ్డారు. తనని అప్రతిష్టపాలు చేయాలన్నదే వారి ఉద్దేశం అని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, కర్షకులను ఆర్థికంగా బలోపేతం చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ఎరువుల ధరలు భారీగా పెరిగినప్పటికీ.. ఆ భారాన్ని రైతులపై పడకుండా ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంటోందని గుర్తుచేశారు.
పీఎం-కిసాన్ నిధులు విడుదల
అలాగే, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 24వ విడతలో సుమారు రూ.19వేల కోట్ల నిధులను మోదీ అధికారికంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ సొమ్ము జమ అయింది. మొత్తం 9.34 కోట్ల మంది రైతు కుటుంబాలకు లబ్ధి పొందాయి. ఈ విడతలో భాగంగా ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే 52.33 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రూ.1,051 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందింది. ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఇప్పటి వరకూ రూ.4.5 లక్షల కోట్లు అందించినట్లు ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read..
సీఈసీపై ప్రజా అభిశంసన కార్యక్రమం వాయిదా
కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు
ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కావొద్దు : డిప్యూటీ సీఎం భట్టి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bandi Sanjay | రైతును రారాజుగా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం: బండి సంజయ్
అక్టోబర్ 30, 2026

Jairam Ramesh | సర్ అనేది మోదీ, షా కుట్ర.. సీఈసీ దీన్ని అమలు చేశారు : జైరామ్ రమేశ్
అక్టోబర్ 29, 2026

Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Web Series Review | రుద్రవనం రివ్యూ - ట్విస్ట్‌లతో సాగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
- ●Bhatti Vikramarka | ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కావొద్దు : డిప్యూటీ సీఎం భట్టి
- ●Public Impeachment | సీఈసీపై ప్రజా అభిశంసన కార్యక్రమం వాయిదా
- ●MLA Sanjay | ‘గ్లోబల్’ కాదు.. నీళ్ల సమ్మిట్ పెడితే ఎట్ల ఎత్తిపోయాల్నో చెప్తం
- ●Google Gemini | గూగుల్ జెమినిలో కొత్త ఫీచర్.. చాట్‌లోనే ఫైల్స్ క్రియేట్, ఎడిట్..
- ●Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?

Web Series Review | రుద్రవనం రివ్యూ - ట్విస్ట్‌లతో సాగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

Bhatti Vikramarka | ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కావొద్దు : డిప్యూటీ సీఎం భట్టి

Public Impeachment | సీఈసీపై ప్రజా అభిశంసన కార్యక్రమం వాయిదా

MLA Sanjay | ‘గ్లోబల్’ కాదు.. నీళ్ల సమ్మిట్ పెడితే ఎట్ల ఎత్తిపోయాల్నో చెప్తం



