Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు
Jairam Ramesh | ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై ఓటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. తాజాగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శానసమండలి ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన పరాజయాలను ప్రస్తావిస్తూ.. ట్రోలింగ్ చేయడం ఆపి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ మోదీకి చురకలంటించారు.
Jairam Ramesh | త్రినేత్ర న్యూస్ : నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్‌లో మొత్తం 28 పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ ఫలితాల తీరులో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. దీంతో ఈ ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకుని ప్రధాని మోదీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) సూచించారు. వారణాసి, నాగ్‌పూర్‌లలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. "ప్రధాని ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి ఇతరులకు పాఠాలు చెబుతున్నారు..! కాంగ్రెస్ సీట్ల గురించి లెక్కపెట్టే ముందు తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో బీజేపీ రెండు స్థానాలను ఎందుకు కోల్పోయిందో, ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన నాగ్‌పూర్‌లో బీజేపీని కాంగ్రెస్ ఎలా ఓడించగలిగిందో ఆయన ఆలోచించాలి" అని జైరామ్ రమేష్ పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని వ్యాఖ్యానించారు. వారణాసి, నాగ్‌పూర్ నుంచి లక్నో, ప్రయాగ్‌రాజ్, పాట్నా వరకూ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వ విధానాలపై స్పష్టంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారని పేర్కొన్నారు. మోదీ గారూ.. ట్రోలింగ్ ఆపి కోట్లాది కుటుంబాలు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రైవేట్ పెట్టుబడుల అంశాలపై దృష్టిపెట్టండి అంటూ చురకలంటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
प्रवचनमंत्री जी को आत्मविश्लेषण की ज़रूरत है, लेकिन वे दूसरों को प्रवचन दे रहे हैं!
कांग्रेस की सीटें गिनने से पहले काश यह भी विचार कर लेते कि उनके अपने संसदीय क्षेत्र वाराणसी की दोनों सीटों पर भाजपा क्यों हारी और RSS के गढ़ नागपुर में कांग्रेस ने भाजपा को कैसे हराया?
मोदी जी,
ट्रोलिंग बंद कीजिए। करोड़ों परिवार कमरतोड़ महंगाई से त्रस्त हैं, युवा बेरोज़गार हैं और निजी निवेश ठप पड़ा है।अहंकार छोड़कर इन मुद्दों पर विचार करिए!
वाराणसी और नागपुर से लेकर लखनऊ, प्रयागराज, पटना की जनता ने स्पष्ट रूप से आपकी नीतियों के ख़िलाफ़ अविश्वास प्रस्ताव पारित किया है।
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 29, 2026
Also Read..
ఆ నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆ అవమానం జీవితాంతం మోయాల్సిందే - పెద్ద వివాదంపై జాన్వీకపూర్ రియాక్షన్
నిహారిక కొణిదెల యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ - సైలెంట్‌గా షూటింగ్ పూర్తి
సంబంధిత వార్తలు

Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ
అక్టోబర్ 29, 2026

Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్
అక్టోబర్ 29, 2026

Congress Zero Seats MLC Polls | బ్యాలెట్ సమరంలో ‘హస్తం’ విలవిల.. 4 రాష్ట్రాలు.. 28 స్థానాలు.. కాంగ్రెస్ ‘జీరో’
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●Indian Aviation Industry | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. విమానయాన రంగానికి రూ.38 వేల కోట్ల నష్టాలు..
- ●Niharika Konidela | నిహారిక కొణిదెల యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ - సైలెంట్‌గా షూటింగ్ పూర్తి
- ●Harish Rao | “నేను రైతునవుతా.. దేశానికి అన్నం పెడతా” అని చెప్పుకొనే రోజు రావాలి
- ●Jafar Panahi | ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమాలు - స్టార్ డైరెక్టర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
- ●ISRO | ఇస్రో కీలక ప్రయోగం.. అయినా నవిక్ పునరుద్ధరణకు మరింత సమయం..
- ●Regime Change | ఆ నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Indian Aviation Industry | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. విమానయాన రంగానికి రూ.38 వేల కోట్ల నష్టాలు..

Niharika Konidela | నిహారిక కొణిదెల యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ - సైలెంట్‌గా షూటింగ్ పూర్తి

Harish Rao | “నేను రైతునవుతా.. దేశానికి అన్నం పెడతా” అని చెప్పుకొనే రోజు రావాలి

Jafar Panahi | ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమాలు - స్టార్ డైరెక్టర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష



