త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series Review | రుద్ర‌వ‌నం రివ్యూ – ట్విస్ట్‌ల‌తో సాగే తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

న‌రేష్ అగ‌స్త్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ రుద్ర‌వ‌నం పీఎస్ శుక్ర‌వారం జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్ష‌క‌లు ముందుకొచ్చింది. ఈ సిరీస్ ఎలా ఉందంటే? రుద్ర‌వ‌నం క‌థ‌...

N

Entertainment | Published On Oct 30, 2026, 2.29 pm IST

Web Series Review | రుద్ర‌వ‌నం రివ్యూ –  ట్విస్ట్‌ల‌తో సాగే తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
Advertisement

Web Series Review |  టాలీవుడ్ యంగ్ హీరో న‌రేష్ అగ‌స్త్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు వెబ్‌సిరీస్ రుద్ర‌వ‌నం పీఎస్ శుక్ర‌వారం జీ5 ఓటీటీలో రిలీజైంది. శ‌శిధ‌ర్ మున్నంగి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో శ్రావ‌ణి రెడ్డి, నారాయ‌ణ స్వామి, బెన‌ర్జీ, చారువాక‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందంటే?

రుద్రవనం కథ...

రుద్ర‌వ‌నం పోలీస్ స్టేష‌న్ ఏరియాలో ఓ గుర్తుతెలియ‌ని డెడ్‌బాడీబ‌య‌ట‌ప‌డుతుంది. ఓ కానిస్టేబుల్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఆ డెబ్‌బాడీ త‌ల మిస్స‌వుతుంది. ఆ శవం ఎవ‌రిదో గుర్తుప‌ట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అదే టైమ్‌లో ఓ దొంగ‌త‌నం కేసుతో పాటు ఎమ్మెల్యే త‌మ్ముడు కూడా మిస్స‌వుతాడు. పొలిటిక‌ల్‌ప‌ర‌మైన ఒత్తిళ్ల కార‌ణంగా ఈ కేసు ఎస్ఐ శివ‌కుమార్‌కు (న‌రేష్ అగ‌స్త్య‌) స‌వాల్‌గా మారుతోంది. మ‌రోవైపు భార్య శ్రావ‌ణి (శ్రావ‌ణి రెడ్డి) తొమ్మిది నెల‌లు నిండ‌టంతో హాస్పిట‌ల్‌లో చేర్పించాల‌ని అనుకుంటాడు శివ‌కుమార్‌. వ‌రుస కేసుల కార‌ణంగా లీవ్ దొర‌క‌దు. త‌న టీమ్‌తో క‌లిసి శివ‌కుమార్ సాగించిన ఇన్వేస్టిగేష‌న్‌లో ఈ మూడు కేసులు ఒక‌దానికొక‌టి లింక్ ఉన్న‌ట్లుగా గుర్తిస్తాడు. అదృశ్య‌మైన ఎమ్మెల్యే త‌మ్ముడు శవంగా క‌నిపిస్తాడు. ఈ హ‌త్య‌లు ఎవ‌రు చేశారు? పోలీసుల‌కు న‌మ్మ‌క‌స్తుడిగా ఉండే అంజిని (చారు వాక‌న్‌) శివ‌కుమార్ ఎందుకు అనుమానించాడు? హంత‌కుడి గురించి శివ‌కుమార్‌కు తెలుసుకున్న షాకింగ్ నిజం ఏమిటి? అన్న‌దే ఈ వెబ్‌సిరీస్ క‌థ‌.

క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్‌

క్రైమ్ ఇన్వేస్టిగేటివ్‌థ్రిల్ల‌ర్ సినిమాలు ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి ప్ర‌తీకారంగా కిల్ల‌ర్‌గా మారిన ఓ సామాన్యుడు...ఎలాంటి క్లూలు లేకుండా జ‌రిగే హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీని సాల్వ్ చేసే హీరో...చివ‌ర‌కు విల‌న్‌కు సంబంధించి ఓ ట్విస్ట్‌....ఈ క‌థ‌ల‌తో మ‌ల‌యాళంలోచాలానే సినిమాలు వ‌చ్చాయి. వాటి స్ఫూర్తితో తెలుగులో కొంద‌రు ద‌ర్శ‌కులు అడ‌పాద‌డ‌పా ఈ జాన‌ర్‌ను ట్రై చేశారు. రుద్ర‌వ‌నం కూడా ఆ ఛాయ‌ల‌తోనే సాగుతోంది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ను జోడించి ద‌ర్శ‌కుడు శ‌శిధ‌ర్ మున్నంగి ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. వృత్తిప‌రంగా పోలీసుల‌కు ఉండే సాధ‌క‌బాధ‌కాలు, పై అధికారుల ఒత్తిళ్ల‌ను క‌థ‌లో అంత‌ర్భాగంగా చూపించిన తీరు బాగుంది. కుటుంబ బాధ్య‌త‌లు, వృత్తి నిర్వ‌హ‌ణ మ‌ధ్య వారు ప‌డే సంఘ‌ర్ష‌ణ‌ను హాస్పిట‌ల్ ఎపిసోడ్‌లో ఆలోచ‌నాత్మ‌కంగా ఆవిష్క‌రించారు.

లాఠీల‌తో ప‌నిలేకుండా...

లాఠీల‌తో ప‌నిలేకుండా కూడా కొన్నిసార్లు క్రైమ్‌ను సాల్వ్ చేయ‌చ్చ‌నే మెసేజ్‌ను క్లైమాక్స్‌లో ఇచ్చారు. ప‌రిస్థితుల ప్ర‌భావం కొంద‌రిని ఎలా నేర‌స్తులుగా మారుస్తుంది? ఓ మ‌నిషిపై ఉండే న‌మ్మ‌కం ఎదుటివారిలో ఏ విధంగా మార్పును తీసుకొస్తుంద‌నే మెసేజ్‌ను ఇచ్చారు.
ట్విస్ట్ బాగుంది కానీ...
ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ క్రైమ్ ఎలిమెంట్స్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ను బ్యాలెన్స్ చేయ‌డంలో త‌డ‌బ‌డిపోయారు. అస‌లైన హంత‌కుడు ఎవ‌ర‌న్న‌ది హీరో క‌నిపెట్టే ట్విస్ట్ బాగుంది. కానీ ఈ క్ర‌మంలో వ‌చ్చే ఇన్వేస్టిగేష‌న్ సీన్లు అక్క‌డే తిరుగుతూ ఎంత‌కు ముందుకు క‌ద‌ల‌ని ఫీలింగ్‌ను క‌లిగిస్తాయి. విల‌న్ రివీలైన త‌ర్వాత వ‌చ్చే సీన్లు, కిల్ల‌ర్ ఫ్లాష్‌బ్యాక్ ఆస‌క్తిగా చెప్ప‌లేక‌పోయారు. ఏడు ఎపిసోడ్స్‌తో రుద్ర‌వ‌నం వెబ్‌సిరీస్ రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ 25 నుంచి 30 నిమిషాల నిడివిలోపే ఉంది.

నిజాయితీ..మంచిత‌నం..

నిజాయితీ, మంచిత‌నం క‌ల‌బోసిన పోలీస్ పాత్ర‌లో న‌రేష్ అగ‌స్త్య న‌ట‌న బాగుంది. పోలీస్ పాత్రకు త‌గ్గ ర‌ఫ్‌నెస్‌లో అత‌డిలో క‌నిపించ‌లేదు. కానిస్టేబుల్లుగా శివ ఆల‌పాటి, ర‌మేష్‌, నారాయ‌ణ స్వామి నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించారు. చారువాక‌న్ విల‌న్ పాత్ర‌కు అంత‌గా సెట్ట‌వ్వ‌లేదు. బెన‌ర్జీ, రాజార‌వీంద్ర వంటి సీనియ‌ర్ల‌ను డైరెక్ట‌ర్ స‌రిగ్గా వాడుకోలేదు. టెక్నిక‌ల్‌గా ప‌వ‌న్ మ్యూజిక్‌, అష్క‌ర్ అలీ సినిమాటోగ్ర‌ఫీ బాగున్నాయి. తాజ్ స‌య్య‌ద్ రాసుకున్న క‌థ , స్క్రీన్‌ప్లేలో ఉత్కంఠ లోపించింది. నిర్మాణ విలువ‌లు ప‌ర్వాలేద‌నిపిస్తాయి.

రుద్ర‌వ‌నం పీఎస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ల‌వ‌ర్స్‌ను మెప్పించే వెబ్ సిరీస్‌.

ట్యాగ్స్:

Crime Thriller Web SeriesLatest Ott ReleasesNaresh AgasthyaRudravanam Web Series ReviewTelugu Web SeriesTollywoodZee5 Ott
Advertisement
Advertisement