Bhatti Vikramarka | ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కావొద్దు : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka | 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది అని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, ప్రతి కుటుంబం జీవితంలో సానుకూల మార్పు తీసుకురావాలన్నారు.
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్ : 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది అని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, ప్రతి కుటుంబం జీవితంలో సానుకూల మార్పు తీసుకురావాలన్నారు. డాక్టర్ ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ (MCRHRD) సంస్థ 50 ఏళ్ల సేవా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణలతోనే సుస్థిర ప్రగతి సాధ్యం. హైదరాబాద్‌లోని ఆర్థిక, సాంకేతిక ప్రగతిని రాష్ట్రంలోని పల్లెలకు, పట్టణాలకు విస్తరించి, యువతకు వారి సొంత జిల్లాల్లోనే ఉపాధి కల్పించడమే మా ధ్యేయం అని భట్టి స్పష్టం చేశారు.
రైతు కుటుంబాలకు సమగ్ర భద్రత, పేద ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే మా ప్రభుత్వ ప్రాధాన్యత. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి ప్రభుత్వ సేవలను వేగవంతం చేయాలని అధికారులకు నా సూచన. ఎస్.ఆర్. శంకరన్ లాంటి నిస్వార్థ ప్రజాసేవకుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని, అధికారులు అంకితభావంతో పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరుతున్నానని భట్టి విక్రమార్క తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MLA Sanjay | ‘గ్లోబల్’ కాదు.. నీళ్ల సమ్మిట్ పెడితే ఎట్ల ఎత్తిపోయాల్నో చెప్తం
- ●Google Gemini | గూగుల్ జెమినిలో కొత్త ఫీచర్.. చాట్‌లోనే ఫైల్స్ క్రియేట్, ఎడిట్..
- ●Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?
- ●Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు
- ●India Poverty | భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ఇక అంతా హ్యాపీయేనా..?
- ●Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు

MLA Sanjay | ‘గ్లోబల్’ కాదు.. నీళ్ల సమ్మిట్ పెడితే ఎట్ల ఎత్తిపోయాల్నో చెప్తం

Google Gemini | గూగుల్ జెమినిలో కొత్త ఫీచర్.. చాట్‌లోనే ఫైల్స్ క్రియేట్, ఎడిట్..

Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?

Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు




