త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Review | సంభ‌వం అధ్యాయం ఒన్ను రివ్యూ – ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం టైమ్ ట్రావెల్ మూవీ

టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన మ‌ల‌యాళ మూవీ సంభ‌వం అధ్యాయం ఒన్ను జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

N

Entertainment | Published On Apr 16, 2026, 9.56 am IST

OTT Review |  సంభ‌వం అధ్యాయం ఒన్ను రివ్యూ – ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం టైమ్ ట్రావెల్ మూవీ
Advertisement

OTT Review |  ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంటారు మ‌ల‌యాళ ద‌ర్శ‌కులు. ఈ కోవ‌లోనే వ‌చ్చిన తాజా మ‌ల‌యాళ సినిమా సంభ‌వం అధ్యాయం ఒన్ను. అస్గ‌ర్ అలీ, సిద్ధార్థ్ భ‌ర‌త‌న్‌, వినీత్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మ‌ల‌యాళం సినిమాకు జీతూ స‌తీష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ జియో హాట్ స్టార్ ఓటీటీలో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందంటే?

అడ‌విలో ఏం జ‌రిగింది?

ఆనంద్ కొచ్చి నుంచి కేర‌ళ‌, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లోని అట‌వీ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేష‌న్‌కు బ‌దిలీ అవుతాడు. డ్యూటీలో జాయిన్ కావ‌డానికి వ‌స్తోన్న టైమ్‌లోనే అత‌డు ప్ర‌యాణిస్తున్న దారిలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ గాయాల‌తో ప‌డి ఉంటాడు. అత‌డిని హాస్పిట‌ల్‌లో జాయిన్ చేస్తాడు ఆనంద్‌. అదే టైమ్‌లో అడ‌విలో ఓ గొడ‌వ జ‌రుగుతుంద‌ని ఫోన్ రావ‌డంతో స్టేష‌న్ ఆఫీస‌ర్ అశోక‌న్‌తో క‌లిసి ఆనంద్ అక్క‌డికి వెళ‌తాడు. తిరిగివ‌స్తోన్న టైమ్‌లో ఆనంద్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసిన పోలీస్‌కు చెందిన వాకిటాకీకి ఓ మెసేజ్ వ‌స్తుంది. అడ‌విలో తాను గాయాల‌తో ప‌డి ఉన్నాన‌ని త‌న‌ను కాపాడ‌మ‌ని స్టీఫెన్ అనే పోలీస్ ఆఫీస‌ర్ ప్రాధేయ‌ప‌డ‌తాడు. అడ‌వి చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, లోప‌లికి వెళ్లిన వారు ఎవ‌రూ తిరిగిరాలేద‌ని మ‌రో పోలీస్ ఆఫీస‌ర్ రెజీ ఎంత చెప్పిన ఆనంద్‌, అశోక‌న్ విన‌రు. ముగ్గురు క‌లిసి అడ‌వి లోప‌లికి వెళ‌తారు. అక్క‌డ వారికి ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? అడ‌విలో కాకి ఆకారంలో ఉన్న టెంపుల్ క‌థేమిటి? 1994లో మిస్స‌యిన స్టీఫెన్‌...2026లో ఉన్న ఆనంద్‌, అశోక‌న్‌ల‌ను ఎలా కాంటాక్ట్ అయ్యాడు? అస‌లు అడ‌వి మిస్ట‌రీ ఏమిటి? త‌న తండ్రితో పాటు కూతురిని ఆనంద్ ఎలా క‌లిశాడు? ఆ అడ‌వి నుంచి అత‌డు బ‌య‌ట‌ప‌డ్డాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

హాలీవుడ్‌లో ఫేమ‌స్‌...

టైమ్ ట్రావెల్ జాన‌ర్ హాలీవుడ్‌లో ఫేమ‌స్‌. ఈ క‌థ‌ల‌తో వ‌చ్చిన టెనెంట్‌, లూప‌ర్‌, ఇంట‌ర్‌స్టెల్ల‌ర్ వంటి సినిమాలు క్లాసిక్‌లుగా నిలిచాయి ఇండియ‌న్ స్క్రీన్‌పై టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ల‌తో చాలా త‌క్కువ మంది ద‌ర్శ‌కులు సినిమాలు చేశారు. మ‌న‌వైన నేటివిటీతో కామ‌న్ ఆడియెన్స్‌కు అర్థ‌మ‌య్యేలా ఈ క‌థ‌ల‌ను చెప్ప‌డం చాలా క‌ష్ట‌మే. కానీ ఈ ప్ర‌య‌త్నంలో సంభ‌వం అధ్యాయం ఒన్నుతో ద‌ర్శ‌కుడు జీతూ స‌తీష‌న్ స‌క్సెస్ అయ్యారు.

మైథాల‌జీ పాయింట్‌....

టైమ్ ట్రావెల్‌కు క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ అంశాల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. అంత‌ర్లీనంగా ఓ మైథాల‌జీ పాయింట్‌ను ట‌చ్ చేయ‌డం బాగుంది. రెండు గంట‌ల ఆరు నిమిషాల నిడివితో కూడిన ఈ సినిమా ఫ‌స్ట్ సీన్ నుంచి లాస్ట్ వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా సాగుతుంది.

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో...

ఓ ఫారిన‌ర్‌....త‌న భ‌ర్త‌తో పాటు ఓ యువ‌తిని చంపే సీన్‌తోనే ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత ఆనంద్ అట‌వీ ప్రాంతానికి బ‌దిలీ కావ‌డం, అత‌డి వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల చూపిస్తూ అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి డైరెక్ట‌ర్ కాస్తంత టైమ్ తీసుకున్నాడు. ఆనంద్‌, అశోక‌న్‌ల‌ను స్టీఫెన్ వాకిటాకీ ద్వారా సంప్ర‌దించడం, అత‌డి కోసం వారు అడ‌విలోకి అడుగుపెట్టే సీన్ నుంచి సినిమా ఉత్కంఠ‌ను పంచుతుంది.
తాము వెతుకుతున్న స్టీఫెన్ 1994వ సంవ‌త్స‌రంలోఉన్నాడ‌ని ఆనంద్ తెలుసుకునే ట్విస్ట్ అదిరిపోతుంది. అక్క‌డి నుంచి ఊహించ‌ని మ‌లుపుల‌తో సినిమాను న‌డిపించారు ద‌ర్శ‌కుడు. డిఫ‌రెంట్ కాలాల్లోకి వెళ్లిన ఆనంద్‌... భిన్న వ్య‌క్తుల‌ను క‌ల‌వ‌డం...ఆ అడ‌వి నుంచి త‌ప్పించుకోవ‌డానికి అత‌డు వేసే ఎత్తులు ఆస‌క్తిని పంచుతాయి. అడ‌విలోని కాకి ఆకార‌ణంలో టెంపుల్ మిస్ట‌రీని కూడా క‌న్వీన్సింగ్‌గా రాసుకున్నారు. ఏ మాత్రం క‌న్ఫ్యూజ‌న్ లేకుండా ప్రతీదీ డీటైలింగ్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు ద‌ర్శ‌కుడు. షాకింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.

సినిమా మొత్తం ఫారెస్ట్ లోనే ....

సినిమాకు లోకేష‌న్స్ హైలైట్‌గా నిలిచాయి. సినిమా మొత్తం అడ‌విలోనే సాగుతుంది. బీజీఎమ్ బాగుంది. అస్గ‌ర్ అలీతో పాటు మిగిలిన వారి న‌ట‌న బాగుంది. క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా సెటిల్డ్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచారు.
టైమ్ ట్రావెల్ తో పాటు ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను సంభ‌వం అధ్యాయం ఒన్ను మెప్పిస్తుంది.

Advertisement
Advertisement