త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఎల్పీజీ స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న‌.. ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మావేశం

PM Modi | ఇరాన్ - అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం (Iran War) గ్లోబల్ ఎనర్జీ సంక్షోభానికి దారితీస్తోంది. ఈ యుద్ధం కార‌ణంగా ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది.

D

National | Published On Mar 10, 2026, 3.30 pm IST

PM Modi | ఎల్పీజీ స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న‌.. ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మావేశం
Advertisement

PM Modi | ఇరాన్ - అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం (Iran War) గ్లోబల్ ఎనర్జీ సంక్షోభానికి దారితీస్తోంది. ఈ యుద్ధం కార‌ణంగా ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. ముఖ్యంగా ఎల్పీజీ స‌ర‌ఫరాపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న (LPG Concerns) వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఈ మేర‌కు ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

యుద్ధం కార‌ణంగా త‌లెత్తే అంత‌రాయాల‌ను అంచ‌నా వేసేందుకు, ఎల్పీజీ స‌ర‌ఫ‌రాను స‌మీక్షించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri), విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి ఎస్‌.జైశంక‌ర్ (S Jaishankar)తో ప్ర‌ధాని మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. యుద్ధం కార‌ణంగా అంత‌ర్జాతీయంగా చ‌మురు, గ్యాస్ స‌ర‌ఫ‌రాలో త‌లెత్తే ఇబ్బందుల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా దేశంలో ఇంధ‌న కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై మంత్రుల‌తో ప్ర‌ధాని చ‌ర్చించ‌నున్నారు.

మ‌రోవైపు ఎల్పీజీ (LPG) వంట గ్యాస్ బుకింగ్ నియమాల్లో కేంద్రం కీలక మార్పులు చేసిన విష‌యం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు గ్యాస్ సిలిండర్ల (LPG Refill) బుకింగ్ మధ్య గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. రాబోయే ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరూ అక్రమంగా సిలిండర్లను నిల్వ చేయకుండా అడ్డుకునేందుకే ఈ ముందస్తు చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గ్యాస్ కొరత రాకుండా దేశంలోని అన్ని ఆయిల్ రిఫైనరీలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సూచించింది. ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను వాణిజ్య (Commercial) లేదా పారిశ్రామిక అవసరాల కంటే.. ముందుగా గృహావసరాల (Domestic) కనెక్షన్లకే సరఫరా చేయాలని తేల్చి చెప్పింది. ఇదే కారణంతో బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లో హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Also Read..

OTT | యూట్యూబ్‌లో రిలీజైన త‌ర్వాత ఓటీటీలోకి ఆమిర్‌ఖాన్ బాలీవుడ్ మూవీ - ఫ‌స్ట్ హిందీ సినిమా ఇదే

Ponnam Prabhakar | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కేనా నిధుల‌న్నీ..? తెలంగాణ‌పై వివ‌క్ష త‌గ‌దు.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్‌

Xiaomi Pad 8 | షియోమీ నుంచి స‌రికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్‌.. పీసీలా వాడుకోవ‌చ్చు..

Advertisement
Advertisement